motorola razr 60 | ఒకప్పుడు ఫ్లిప్ ఫోన్లకు వినియోగదారుల్లో ఎంతటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే ఆండ్రాయిడ్ యుగం ప్రారంభం అయ్యాక ఈ తరహా ఫోన్లు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. కానీ మళ్లీ ఇప్పుడిప్పుడే ఇలాంటి ఫోన్లను కంపెనీలు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒప్పో, శాంసంగ్ వంటి కంపెనీలు ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్లను రూపొందించాయి. కానీ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇదే కోవలో తాజాగా మోటోరోలా కూడా ఓ నూతన ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. మోటోరోలా లేటెస్ట్గా రేజర్ 60 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.96 ఇంచుల ఇంటర్నల్ ఫోల్డబుల్ పీఓలెట్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తోపాటు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్‌కు గాను 3.63 ఇంచుల మరో పీఓలెడ్ డిస్ప్లేను బయటి వైపు ఏర్పాటు చేశారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండడం విశేషం. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400ఎక్స్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా మరో 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ను 5 లక్షల సార్లు ఫ్లిప్ చేయవచ్చని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్కు కూడా ఇందులో సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ డిస్ప్లేలకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 256 జీబీ స్టోరేజ్‌తో సింగిల్ వేరియెంట్‌ను మాత్రమే లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో లభిస్తుంది. 3 ఆపరేటింగ్ సిస్టమ్‌లను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు.
యూఎస్బీ టైప్ సి కి సపోర్ట్‌ను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈతోపాటు వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ పాంటోన్ గిబ్రల్స్టార్ సీ, పాంటోన్ స్ప్రింగ్ బడ్, పాంటోన్ లైటెస్ట్ స్కై కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.49,999గా ఉంది. జూన్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను మోటోరోలా ఆన్ లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.