న్యూఢిల్లీ : భారత్‌లో ఎడ్జ్ 30 అల్ట్రా 12 జీబీ వేరియంట్‌ను మొటోరోలా లాంఛ్ చేసింది. ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంఛ్‌తో లెనోవాకు చెందిన మొటొరోలా ఎడ్జ్ 30 సిరీస్‌ను విస్తరిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు కర్వ్డ్ డిస్ప్లేలతో కస్టమర్ల ముందుకొచ్చాయి.
ఎడ్జ్ 30 అల్ట్రా మేజర్ హైలైట్స్ విషయానికి వస్తే లేటెస్ట్ మోటో స్మార్ట్‌ఫోన్ 200 ఎంపీ కెమెరా సెన్సర్‌తో ఈ తరహా భారీ సెన్సర్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైజ్ ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో మోటో ఎడ్జ్ 30 అల్ర్టా 8జీబీ వేరియంట్‌తో విడుదలైంది.
లేటెస్ట్ మోటో ఫోన్‌ను కంపెనీ రూ 64,999 కాగా రూ 56,999 డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది. మొటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 6.67 ఇంచ్ కర్వ్డ్ పోల్డ్ డిస్ప్లేతో అండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఎడ్జ్ 30 అల్ట్రా 125డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, 50డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో 4610ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.