Edge 70 | మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల మధ్య పోటీ బాగా పెరిగింది. కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త ఫోన్లను రూపొందించి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అనేక కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేశాయి. ఇక ఇదే విభాగంలో మోటోరోలా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎడ్జ్ 70 అనే ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. డిస్ప్లే 6.7 ఇంచులు ఉండగా, ఇది అమోలెడ్ తరహాలో ఉంటుంది. కాబట్టి చాలా క్వాలిటీగా ఉంటుంది. రిజల్యూషన్ కూడా ఎక్కువే. ఏకంగా 1.5కె వరకు వస్తుంది. ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ ఉండగా, 8జీబీ ర్యామ్ వాడుకోవచ్చు. అవసరం అయితే ర్యామ్‌ను వర్చువల్‌గా 16జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు వైపు కూడా 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ను మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేసినందున ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. పూర్తిగా మిలిటరీ గ్రేడ్ క్వాలిటీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. కాబట్టి చాలా దృఢంగా ఉంటుంది. ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను యూజర్లు ఇందులో వాడుకోవచ్చు. 4 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ వస్తాయి. అలాగే 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను కూడా అందిస్తారు. ఇందులో అన్ని ఫోన్లలాగే ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. మోటో ఏఐ 2.0 ఇందులో లభిస్తుంది. దీని వల్ల ఇమేజ్‌లు, వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సులభంగా ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ఎడ్జ్ 70 ఫోన్ లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇవ్వగా దీనికి 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కనుక ఈ ఫోన్ ను వేగంగా చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్ 5.99 ఎంఎం మందంతో చాలా స్లిమ్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. డ్యుయల్ సిమ్ లను వేసుకోవడంతో పాటు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్ లో ఈ ఫోన్ ను విడుదల చేశారు.
సౌండ్ క్యాలిటీ కావాలనుకునే వారి కోసం ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. 5జి, ఎన్ ఎఫ్ సీ, బ్లూటూత్ 5.4, వైఫై6, డ్యుయల్ 4జి వీవోఎల్ టీఈ, యూఎస్ బీ టైప్ సి సదుపాయాలు ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ రూ. 29,999 ధరకు అందుబాటులో ఉండగా, దీని కొనుగోలుపై రూ. 1వేయి బ్యాంక్ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్ లో విక్రయిస్తారు. డిసెంబర్ 23 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.