తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఫ్లాగ్ షిప్ ఫోన్లను తయారు చేస్తున్న కంపెనీలు సైతం మిడ్ రేంజ్ ఫోన్ల మార్కెట్లో బలం పుంజుకునేందుకు చూస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు అద్భుతమైన మిడ్ రేంజ్ ఫోన్లను విడుదల చేశాయి. ఇక ఇదే కోవలో మోటోరోలా కూడా మరో సరికొత్త ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రొ పేరిట సదరు కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల 1.5కె క్వాడ్ కర్వ్డ్ పీఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది.
ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లేకు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు. అందువల్ల సూర్యకాంతిలోనూ ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా కనిపిస్తుంది. హెచ్డీఆర్ 10 ప్లస్ ఫీచర్‌ను ఈ డిస్ప్లే కలిగి ఉంది. కనుక డిస్ప్లేపై చాలా క్వాలిటీ కలిగిన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. 3 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. మోటో ఏఐ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఐపీ68, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. దీనికి మిలిటరీ గ్రేడ్ నాణ్యతను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. మరో 10 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. దీంతో 50ఎక్స్ వరకు హైబ్రిడ్ జూమ్ లభిస్తుంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. కనుక ఈ ఫోన్ కెమెరాలతో అద్భుతమైన చిత్రాలను తీసుకోవచ్చని చెప్పవచ్చు. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా లభిస్తుంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ల రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లను కూడా పొందవచ్చు. ఫోన్ బాక్స్‌లోనే చార్జర్‌ను కూడా అందిస్తున్నారు. 8జీబీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది కనుక ఆడియో అత్యంత నాణ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. 5జి సేవలను ఇందులో ఉపయోగించుకోవచ్చు.
డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లో పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్60 ప్రొ స్మార్ట్ ఫోన్‌ను పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ షాడో, పాంటోన్ స్పార్ల్కింగ్ గ్రేప్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్స్ లోనూ ఈ ఫోన్ లభిస్తోంది. మే 7వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.