moto pad 60 NEO | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ ట్యాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే మోటోరోలా ఓ నూతన ట్యాబ్‌ను లాంచ్ చేసింది. మోటో ప్యాడ్ 60 నియో పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేశారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడమే కాదు, దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. మోటో ప్యాడ్ 60 నియో ట్యాబ్‌లో 11 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 2.5కె రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ సెజ్‌మెంట్‌లో ఇంతటి అద్భుతమైన డిస్ప్లే కలిగిన ట్యాబ్ ఇదే కావడం విశేషం. ఈ ట్యాబ్‌తోపాటు ఒక స్టైలస్ పెన్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు 5జి కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.
ట్యాబ్ కేవలం 6.99 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉండి అత్యంత పలుచగా ఉంటుంది. దీనికి క్వాడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. కనుక అద్భుతమైన సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 7040 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ కూడా ఉంది. కనుక ట్యాబ్ ఎక్కువ సమయం పాటు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ట్యాబ్‌లో 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది. ఈ ట్యాబ్ సుమారుగా 480 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఐపీ 52 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. 4జీ ఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలు సైతం ఇందులో ఉన్నాయి. ఈ ట్యాబ్ లో ఉన్న బ్యాటరీకి గాను 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. కనుక ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్‌తోపాటు బాక్స్‌లో 68 వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను అందిస్తున్నారు.
మోటోప్యాడ్ 60 నియో ట్యాబ్‌ను పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో మాత్రమే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ 5జి మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, మోటోరోలా ఆన్లైన్ స్టోర్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి విక్రయించనున్నారు. బ్యాంకు ఆఫర్లతోఈ ట్యాబ్‌ను రూ.12,999 కే పొందే సదుపాయాన్ని అందిస్తున్నారు.