న్యూఢిల్లీ : మోటో జీ82 5జీ మంగళవారం భారత్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంఛ్‌కు ముందు మోటో జీ82 కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ప్లిఫ్‌కార్ట్ ఇప్పటికే లేటెస్ట్ 5జీ ఫోన్ కోసం డెడికేటెడ్ పేజ్‌ను పబ్లిష్ చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్‌తో మోటో జీ82 5జీ కస్టమర్ల ముందుకు రానుంది.
భారత్‌లో లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ 25,000 నుంచి అందుబాటులో ఉండనుంది. మోటో జీ82 5జీ ధరను కంపెనీ జూన్ 7న లాంఛ్ సందర్భంగా అధికారికంగా ప్రకటించనుంది. గ్రే, వైట్ లిల్లీ కలర్స్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ 5జీ చిప్సెట్తో 30డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ ఫోన్ లాంఛ్ కానుంది.
డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్ కలిగిఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో సెన్సర్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సర్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.