Mega Electronics Sale | హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి గ్యాడ్జెట్స్ కొనాలని చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీ కోసమే ఒక గొప్ప సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను భారీ డిస్కౌంట్లకు కొనే వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా డెల్, సోనీ, శాంసంగ్ వంటి కంపెనీలకు చెందిన గ్యాడ్జెట్లను చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. అనేక ఉత్పత్తులపై ఏకంగా 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నారు. మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా మే 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రూ.30వేలు మొదలుకొని రూ.90 వేల వరకు అద్భుతమైన రాయితీతో పలు ల్యాప్‌టాప్‌లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
ఏసర్, డెల్, ఎంఎస్ఐ, హెచ్‌పీ, అసుస్ వంటి కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అలాగే హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్‌ను కూడా చాలా తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. హానర్ ప్యాడ్ 8 ను రూ.12వేలకు, వన్ ప్లస్ ప్యాడ్ గో ను రూ.18వేలకు, షియోమీ ప్యాడ్ 6ను రూ.24వేలకు, రెడ్మీ ప్యాడ్ ప్రొ 5జి ని రూ.25వేలకు, షియోమీ ప్యాడ్ 7 ను రూ.28వేలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ ట్యాబ్‌ను రూ.31వేలకు, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ట్యాబ్‌ను రూ.35వేలకు, యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్ ట్యాబ్‌ను రూ.35వేల ప్రారంభ ధరకు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ ట్యాబ్‌ను రూ.70వేలకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్ వాచ్‌లను అందిస్తున్నారు. ఫైర్ బోల్ట్, రెడ్మీ వాచ్, నాయిస్, అమేజ్‌ఫిట్, గెలాక్సీ వాచ్, యాపిల్ వాచ్ సిరీస్ 9 వంటి స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. డిజిటెక్, ఐమో, షియోమీ, హినిసో, ఇన్‌స్టా, గో ప్రో, డీజేఐ ఆస్మో, పానాసోనిక్, సోనీ వంటి కంపెనీలకు చెందిన డిజిటల్ కెమెరాలను కూడా తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులపై ఆకట్టుకునే ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్ఎస్బీసీ, ఫెడరల్ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో ఈ ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తున్నారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డులతో ఈ వస్తువులను కొనుగోలు చేస్తే రూ.3500 వరకు డిస్కౌంట్‌ను ఇస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన క్రెడిట్ కార్డులతో ఈ వస్తువులను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈఎంఐ విధానంలో చేసే కొనుగోళ్లపై కూడా రాయితీలను పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్ సైట్లో డీల్స్ పేజీని సందర్శించవచ్చు.