Lava Play Ultra | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే లావా మొబైల్స్ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. లావా ప్లే అల్ట్రా పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువగా ఉండడం విశేషం. ఇందులో 6.67 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ప్రత్యేకంగా హైపర్ ఇంజిన్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ లో అద్భుతమైన విజువల్స్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 5 మెగాపిక్సల్ మాక్రో లెన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గాను నైట్ మోడ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఆర్, పోర్ట్రెయిట్, బ్యూటీ, పనోరమా, స్లో మోషన్, డాక్యుమెంట్ స్కానింగ్, టైమ్ లాప్స్, ఫిల్టర్స్, ప్రొ మోడ్, ఏఆర్ స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్ స్కానింగ్, ప్రొ వీడియో, గూగుల్ లెన్స్, డ్యుయల్ వ్యూ వీడియో, మాక్రో ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. అందువల్ల అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు లభిస్తుంది. ఫోన్లో ఎలాంటి బ్లోట్‌వేర్ లేదని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌కు గాను 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. చార్జర్‌ను ఫోన్‌తోపాటు అందిస్తున్నారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
లావా ప్లే అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను ఆర్కిటిక్ ఫ్రాస్ట్, ఆర్కిటిక్ స్లేట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.14,999 ధరకు అందిస్తుండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.16,499కు అందిస్తున్నారు. ఈ ఫోన్లను అమెజాన్ లో ఆగస్టు 25 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు సర్వీస్ ఎట్ హోమ్ సదుపాయాన్ని అందించనున్నారు. ఫోన్లో ఏదైనా సమస్య వస్తే టెక్నిషియన్ నేరుగా ఇంటికే వచ్చి రిపేర్ చేసి ఇస్తారు. లాంచింగ్ కింద ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 రాయితీని ఇస్తున్నారు.