Lava Bold N1 5G | మొబైల్స్ తయారీదారు లావా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బోల్డ్ ఎన్1 4జి, బోల్డ్ ఎన్1 ప్రొ పేరిట ఇటీవలే ఓ రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయగా, తాజాగా ఇదే సిరీస్‌లో మరో నూతన ఫోన్‌ను 5జి వేరియెంట్లో రిలీజ్ చేసింది. బోల్డ్ ఎన్1 5జి ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. బోల్డ్ ఎన్1 5జి ఫోన్లో 6.75 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో యూనిసోక్ టి765 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 4జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎలాంటి బ్లోట్ వేర్ లేదని, క్లీన్ ఓఎస్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలియజేసింది. కనుక ఫోన్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆపరేట్ చేసుకునే వీలు ఉంటుందని తెలిపింది. ఇక ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌కు 10 వాట్ల చార్జర్‌ను బాక్స్‌తోపాటు అందిస్తున్నారు. అందువల్ల చార్జర్‌ను విడిగా కొనాల్సిన పనిలేదు.
4జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. ఐపీ 54 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం ఈ ఫోన్లో అందిస్తున్నారు.
లావా బోల్డ్ ఎన్1 5జి ఫోన్‌ను షాంపేన్ గోల్డ్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7,499 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.7,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌ను త్వరలో జరగనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఎస్బీఐ కార్డులతో రూ.750 డిస్కౌంట్‌ను అందించనున్నారు.