Lava Blaze 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా.. త్వరలో భారత్ మార్కెట్లోకి బ్లేజ్-2 ఆవిష్కరించనున్నది. గతేడాది నవంబర్‌లో ఆవిష్కరించిన లావా బ్లేజ్ 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా బ్లేజ్-2 వస్తున్నట్లు తెలుస్తున్నది. సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. లావా బ్లేజ్-2 ఫోన్ ఈ నెల 20న భారత్ మార్కెట్లోకి రావచ్చునని తెలుస్తున్నది.
6జీబీ రామ్ విత్ 5జీబీ వర్చువల్ రామ్ ప్లస్ 128 జీబీ ఆఫ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ సామర్థ్యంతో లావా బ్లేజ్-2 వస్తుందని తెలుస్తున్నది. గ్లాస్ ఆరేంజ్, గ్లాస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.10 వేల లోపు ఉంటుందని చెబుతున్నారు. 6-5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్. ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేయనున్న ఈ ఫోన్లో యూనిసోక్ టీ 616 ఎస్వోసీ చిప్సెట్ వస్తుందని భావిస్తున్నారు.
లావా బ్లేజ్-2 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. టాప్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్యాక్ ప్యానెల్లో రెండు సర్క్యులర్ మాడ్యూల్స్‌లో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా వస్తుంది. 13-మెగా పిక్సెల్ అండ్ ఏఐ-సపోర్టెడ్ లెన్స్, 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరా విత్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తుందని తెలుస్తున్నది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. దీనికి యూఎస్బీ-టైప్ సీ పోర్ట్ కూడా అందిస్తున్నది లావా.