Naya Mall | యాపిల్ కోసం.. మోఫీ!
ఐఫోన్ కొన్నారంటే.. వెంటనే ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్ కొనేస్తారు. మూడింటినీ ఎంతో మురిపెంగా చూసుకుంటారు. అయితే, బిజినెస్ ట్రిప్స్, ఫ్యామిలీ వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. వీటన్నిటినీ చార్జింగ్ చేయడం కష్టమే! ఒక్కో పరికరానికి ఒక్కో చార్జర్ వెంట తీసుకెళ్లడం కూడా ఇబ్బందే! ఇందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ.. ‘మోఫీ’ చక్కని పరిష్కారం చూపింది. యాపిల్ ‘మ్యాగ్ సేఫ్’ టెక్నాలజీకి అనుకూలంగా, 3 ఇన్ 1 వైర్లెస్ ట్రావెల్ చార్జర్ కిట్‌ను తీసుకొచ్చింది. ఈ ఒక్క పరికరం ఉంటే చాలు.. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్‌ను ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 15 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనిద్వారా యాపిల్ పరికరాలన్నీ నిమిషాల్లోనే చార్జ్ అవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. 3 ఇన్ 1 చార్జర్‌తోపాటు యూఎస్బీ – సీ కేబుల్, పవర్ బ్రిక్ ఉండే ఈ కిట్ ఖరీదు.. రూ.12,500. zagg.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
కుర్చీల్లో కళాత్మకత
ఒకప్పుడు కుర్చీలు అతిథులు ఆసీనులు అయ్యేందుకే పనికొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇంటి అలంకరణలోనూ ఓ చేయి వేస్తున్నాయి. ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ‘అలంకారం’.. ‘పౌలీ’ పేరుతో లాంజ్ కుర్చీలను
ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి ఫర్నిచర్‌గా మాత్రమే కాదు.. ఇంటి ఇంటీరియర్ డిజైన్లోనూ భాగమవుతాయి. ఈ కుర్చీల తయారీలో పూర్తిగా చేతితో నేసిన ఫ్యాబ్రిక్‌ను వాడారు. దాంతో వీటిలో రాజసం ఉట్టిపడుతుంది. సంప్రదాయ హస్తకళ ద్వారా వేసిన డిజైన్లలో.. భారతీయ కళాత్మకత కనిపిస్తుంది. మొత్తంగా ఈ లాంజ్ కుర్చీలు సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. ఇంటికి రాయల్ లుక్‌నూ తీసుకొస్తాయి. హాలు, బాల్కనీ.. ఎక్కడ వేసినా ఆ ప్రాంతానికి కొత్త అందాన్నిస్తాయి. టేకుతో తయారు చేయడంతో ఎక్కువ మన్నికనూ ఇస్తాయి. రాజసాన్ని ఒలకబోసే ఈ లాంజ్ కుర్చీల ధర.. ఒక్కటి రూ.91,400. alankaram.inలో లభ్యమవుతాయి.
కాలుష్యానికి చెక్
భారతీయ సంస్థ ‘యూబ్రీత్’.. మినీలైట్ నేచురల్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను తీసుకొచ్చింది. ఇందులో ప్యూరిఫయర్‌తోపాటు ఒక మొక్క కూడా ఉంటుంది. అది స్మార్ట్ బయో ఫిల్టర్‌గా పనిచేస్తుంది. ఈ పరికరంలోని మొక్క ఆకులు ‘ఫైటోరెమెడియేషన్’ చర్య ద్వారా గాలిని శుభ్రపరుస్తాయి. ఇది గదిలోని కాలుష్యాన్ని తగ్గించి.. ఆక్సిజన్ స్థాయులను పెంచుతుంది. స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. 50 మొక్కలు అందించే పరిశుద్ధమైన గాలిని.. ఈ ఒక్క ప్యూరిఫయరే అందిస్తుంది. ఈ పరికరం ఎక్కడైనా ఇట్టే అమరిపోతుంది. బ్రీతింగ్ రూట్స్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ ప్యూరిఫయర్ ధర.. రూ.3,599 నుంచి ప్రారంభం అవుతుంది. ubreathe.in వెబ్‌సైట్‌తోపాటు అన్ని ఆన్లైన్ స్టోర్లలో దొరుకుతుంది.
జుట్టీలకే.. జై!
జుట్టీలు.. పంజాబీల సంప్రదాయ పాదరక్షలు. ఫంక్షన్ ఏదైనా.. జుట్టీలు వేయాల్సిందే! భాంగ్రా డాన్స్ చేయాల్సిందే! ఒకప్పుడు పంజాబ్‌కే పరిమితమైనా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. హైహీల్స్‌కు దూరంగా ఉండే వారికి.. జుట్టీలు మంచి ఎంపిక. ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి. చూడ్డానికి ట్రెండీగా, ైస్టెలిష్‌గా కనిపిస్తాయి. ‘పండుగలైనా, ఫంక్షన్లయినా.. జుట్టీలే మా చాయిస్’ అనేవారి కోసం, ప్రముఖ డిజైనర్ అభినవ్ మిశ్రా చూడచక్కగా రూపకల్పన చేశారు.
నీడిల్డస్ట్ సంస్థ వీటిని తయారుచేసి.. మార్కెట్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా చేతి పనితోనే తయారైన ఈ జుట్టీలు పర్యావరణహితం కూడా! జర్దోసీ, మిర్రర్ వర్క్‌తో సంప్రదాయ, ట్రెండీ వస్ర్తాలపైకి కూడా చక్కగా నప్పుతాయి. ఆకర్షణీయమైన రంగుల్లో లభించే ఈ జుట్టీల ధరలు.. రూ.7,690 నుంచి ప్రారంభం అవుతున్నాయి. needledust.com నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు