గజిబిజి జీవితాలు, గందరగోళాలకు దూరంగా ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపడానికే ట్రిప్‌లకు వెళ్తుంటారు కొందరు. అక్కడ కూడా ఫోన్లకు, లైట్లకు, వీడియో ఎడిటింగ్‌లకు, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఎక్కడెక్కడ తిరిగినా విద్యుత్ మన వెంటే ఉండేలా సహకరిస్తుంది ‘జాకరీ ఎక్స్‌ప్లోరర్ 3000 ప్రొ’ పరికరం. దీన్ని సోలార్ జనరేటర్‌గా చెప్పొచ్చు. దీంతోపాటు వచ్చే పోర్టబుల్ సోలార్ ప్యానెల్స్‌తో చార్జ్ అవుతుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. వీటి సాయంతో మూడు నాలుగు గంటల్లో చార్జ్ అవుతుంది. 3024 వాట్ల కెపాసిటీ దీని సొంతం. యూఎస్బీ పోర్టులతో పాటు రకరకాల పరికరాలకు అనువైన ప్లగ్‌లు ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లే కాదు.. టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్లాంటి వాటికి కూడా వినియోగించుకోవచ్చు. ఎండ తక్కువ ఉన్నా పనిచేయగలగడం ఈ సోలార్ ప్యానెల్స్ ప్రత్యేకత. ఒక వేళ కావాలనుకుంటే సాధారణ కరెంటుతోనూ దీన్ని చార్జింగ్ పెట్టుకోవచ్చు. ధర రూ. 2.30లక్షలు. jackery.comలో దొరుకుతుంది.
కాలేజ్, ఆఫీస్, ట్రిప్.. ఎక్కడికెళ్లినా ల్యాప్‌టాప్, ట్యాబ్‌లాంటి గ్యాడ్జెట్స్ మనతో తప్పకుండా తీసుకెళ్తాం. అవి కాక ఛార్జర్లూ, డాక్యుమెంట్లూ… ఇలా అనేకం అవసరం అవుతాయి. వీటన్నిటినీ కుదురుగా ఒక చోట సర్దాలంటే సాధారణ బ్యాక్ ప్యాక్‌లో అవకాశం ఉండదు. అలాగని పెద్దపెద్ద సూట్‌కేస్‌లు మోసుకెళ్లలేం. అలాంటి సందర్భాలకు చక్కగా సరిపోతుంది మొకోబరా సంస్థ ‘ద ఓవర్‌నైట్ బ్యాక్‌ప్యాక్’. చూసేందుకు బ్యాక్‌ప్యాక్, సర్దేందుకు సూట్‌కేస్.. అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ల్యాప్‌టాప్, ఏ4 సైజ్ కాగితాలు, ఫైళ్లు, ఐపాడ్, ఛార్జర్లు, బట్టలు, స్టిక్కీ నోట్స్, చిన్నా చితకా వస్తువులు.. ఇలా ఒక్కోటీ పెట్టుకోవడానికి ఒక్కో ప్రత్యేకమైన అలమర ఉంటుంది ఇందులో. కాబట్టి సర్దుకోవడమూ, ఏం కావాలన్నా గబుక్కున తీసుకోవడమూ సులభమవుతుంది. మాయిశ్చరైజర్లు, ఫేస్‌వాష్‌ల లాంటివాటికోసం స్పిల్ప్రూఫ్ జిప్పర్ ఉంది. పవర్‌బ్యాంక్ పెట్టుకోవడానికి, దాని ద్వారా బ్యాగు బయట నుంచే ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు ఉంది. అమెజాన్‌లో దొరుకుతుంది. ధర రూ. 8,499.
కొండలెక్కే పనిలో ఉన్నా, బంగీ జంప్ జోరులో ఉన్నా, స్కైడైవింగ్ సరదాలో ఉన్నా.. ఆ అనుభూతులన్నిటినీ అచ్చంగా బంధించాలన్న ముచ్చట ఉంటుంది. ఇలాంటి యాక్షన్ సీన్లను సహజంగా చిత్రించేందుకే ఒక చిన్న కెమెరా మార్కెట్లోకి వచ్చింది. వేలెడంతే ఉండే దీన్ని టోపీ, చొక్కా, బ్యాగు, కారు.. ఇలా ఎక్కడైనా సులభంగా అమర్చుకోవచ్చు. యాంగిల్ చూసి సెట్ చేసుకుంటే మనం చేసే పనులన్నిటినీ చక్కగా వీడియో తీస్తుంది. నీళ్లలోనూ, దుమ్ములోనూ పనిచేయడం దీని ప్రత్యేకత. మనం డ్రైవింగ్‌లో ఉన్నా, పరుగెడుతున్నా వీడియో తీసేయగలదు. కేవలం 35 గ్రాముల బరువు కలిగిన ఈ యాక్షన్ కెమెరా పేరు ‘ఇన్‌స్టా 360 గో 3’. ఇందులోని 360 డిగ్రీస్ ఆరిజాన్ లాక్ ఫీచర్ వల్ల కెమెరా ఎన్ని వంకలు తిరిగినా మనకు డిస్ప్లే అయ్యేప్పుడు మాత్రం స్క్రీన్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఇందులోని ఏఐ పవర్డ్ ఎడిటింగ్ ఆప్షన్ మన వీడియోల్లోని హైలైట్స్ తీసి, దానికి మ్యూజిక్ జతచేసి వీడియోలు, షాట్లు చేసి పెడుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబీ, 64 జీబీ, 128 జీబీలతో లభిస్తున్నది. యాప్‌తో ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ. 31,200. store.insta360.comలో కొనుగోలు చేయవచ్చు.
ఈ మధ్య పెద్ద పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్విస్ వాచీల తయారీ సంస్థ స్వాచ్ కూడా ఈ దోవలోనే వెళ్తున్నది. ఇటీవల ‘వాట్ ఇఫ్?’ పేరిట ఓ కలెక్షన్ తీసుకొచ్చింది. ఇందులోని వాచీల డయల్ కేస్, స్ట్రాప్.. పక్కాగా బయో సోర్స్డ్ (జీవ పదార్థాల నుంచి తయారు చేసినవి) ఉత్పత్తులే. గ్లాస్‌ను కూడా బయో సిరామిక్‌తో రూపొందించారు. అంటే.. ఈ గ్లాస్లో మూడింట ఒక వంతు పదార్థం ఆముదం నుంచి చేసింది. అలాగే మిగిలినది.. ప్రకృతిలో లభించే జిర్కోనియాతో తయారైనది. బయోసిరామిక్ గ్లాస్ మీద గీతలు కూడా పడవట. ఈ ఫ్యాషనబుల్ వాచీలను నలుపు, తెలుపు, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో తీసుకువచ్చారు. ధర రూ. 9000. నచ్చితే swatch.comలో ఆర్డరు చేయవచ్చు.
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”