రిలయెన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో.. త్వరలోనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. జియో నుంచి వచ్చే తొలి స్మార్ట్ ఫోన్ ఇది. దాని పేరు జియో ఫోన్ నెక్స్ట్ ఈ ఫోన్ ను సెప్టెంబర్ 10 న అంటే రేపు విడుదల చేయనున్నారు.
గూగుల్ తో కలిసి ఈ ఫోన్ ను జియో తీసుకురానుంది. 4జీ నెట్ వర్క్ తో ఆండ్రాయిడ్ యాప్స్ తో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ 2జీ ఫోన్లు ఉపయోగించేవాళ్లకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనుభవం కావాలంటే.. జియో ఫోన్ నెక్స్ట్ బెస్ట్ ఫోన్ అని జియో చెబుతోంది.
ఇక.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ ఫోన్ ధర రూ.3499 గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే 3500 రూపాయల లోపే ఆండ్రాయిడ్, 4జీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అందుకే.. దీన్ని రిలయెన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ గా అభివర్ణించింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత వెంటనే సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.
4జీ నెట్ వర్క్ తో పాటు బిగ్ స్క్రీన్, ఏఐ, ఫాస్ట్ ప్రాసెసర్, గుడ్ కెమెరా, గొరిల్లా గ్లాస్ లాంటి బెస్ట్ ఫీచర్లతోనే ఈ ఫోన్ విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది.