iQoo Neo 7 5G | ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ (IQoo) దేశీయ మార్కెట్లోకి ఐక్యూ నియో 7 (iQoo Neo 7) 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. గతేడాది మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూ నియో6 వేరియంట్ ఫోన్‌కు అప్ గ్రేడెడ్ వర్షన్.. ఐక్యూ నియో 7. మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో దేశీయ మార్కెట్లోకి తొలిసారి వస్తున్న స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్‌తోపాటు 120-వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జర్ అందుబాటులో ఉంటుంది. కేవలం 10 నిమిసాల్లో 50 శాతం ఫోన్ చార్జింగ్ అవుతుంది.
ఐక్యూ నియో7 ఫోన్ 5జీ రెండు వేరియంట్లలో లభ్యం అవుతున్నది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్నది. 8జీబీ రామ్ వేరియంట్ ఫోన్ రూ.29,999, 12జీబీ వేరియంట్ రూ.33,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ స్టెల్లార్ బ్లాక్, ఫ్రోస్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ప్లాట్ ఫామ్‌పై ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డులపై ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ రూ.1500, ఫోన్ ఎక్స్చేంజ్ కింద అదనపు రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ ఫోన్ తొమ్మిది నెలల్లో నో-కాస్ట్ ఈఎంఐలతో సొంతం చేసుకోవచ్చు.
6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో అందుబాటులో ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలీ జీ610 జీయూపీ విత్ 4ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 8200 5జీ ప్రాసెసర్ లభిస్తాయి.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పని చేస్తుంది. గేమింగ్ కోసం గ్రాఫైట్ 3డీ కూలింగ్ సిస్టమ్ లభిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మైక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సర్ లభిస్తాయి. సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీల సామర్థ్యం గల కెమెరా లభిస్తుంది.
5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 120 వాట్ల ఫ్లాష్ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్‌తో లభిస్తుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓటీజీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ ఫ్రా రెడ్ రిమోట్ కంట్రోల్ కూడా కలిగి ఉంటుంది.