iPhone 17 Offers | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను ఆయా దేశాల మార్కెట్లలో ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లకు గాను ఈవెంట్ జరిగిన రోజునే ప్రీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఇక భారత్‌లోనూ ఈ ఫోన్లను విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనపు బోనస్‌ను పొందవచ్చు. అలాగే పలు బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
భారత్‌లో యాపిల్‌కు చెందిన ప్రధాన డిస్ట్రిబ్యూటర్ ఇన్‌గ్రామ్ మైక్రో కొత్త ఐఫోన్లపై పలు ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 17 ఫోన్లపై ఏకంగా 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.7వేల వరకు బోనస్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. ఐఫోన్ 17 ఫోన్‌పై ప్రత్యేకంగా రూ.6వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఐఫోన్ 17 ప్రొ, ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ ఫోన్లపై రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
నూతన ఐఫోన్ మోడల్స్‌ను విక్రయించే నేపథ్యంలో ఇన్ గ్రామ్ మైక్రో ఐఫోన్ ఫర్ లైఫ్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో ఇన్ గ్రామ్ మైక్రో భాగస్వామ్యం అయింది. దీని వల్ల ఐసీఐసీ బ్యాంకు కార్డులు కలిగిన కస్టమర్లు 24 నెలల ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే డివైస్ ఖరీదులో 75 శాతం మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఈఎంఐ ముగిసే సమయంలో మిగిలిన 25 శాతం మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదా ఐఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే డివైస్ ఖరీదులో 25 శాతం మొత్తాన్ని తిరిగి కస్టమర్‌కు ఇస్తారు. ఇక యాపిల్ కొత్త వాచ్‌లపై కూడా ఆఫర్లను అందిస్తున్నారు.
యాపిల్ వాచ్ అల్ట్రా 3పై రూ.3వేల క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. వాచ్ సిరీస్ 11 వాచ్‌లపై రూ.2500, వాచ్ ఎస్ఈ 3పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు. వీటికి 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నూతన ఎయిర్ పాడ్స్ ప్రొ 3 మోడల్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. దీనిపై కూడా 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎస్బీఐ బ్యాంకులకు చెందిన కార్డులు, టీవీఎస్ క్రెడిట్ వంటి కంపెనీలు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఐఫోన్ 17 ఫోన్లపై రూ.6వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. ఇక కొత్త ఐఫోన్ మోడల్స్‌ను సెప్టెంబర్ 19 నుంచి భారత్ లో విక్రయించనున్నారు.