న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెలలో ఐఫోన్ 15 (iPhone 15) లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లను యాపిల్ ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 14 ప్రొ సిరీస్ తరహాలో ఐఫోన్ 15 ప్రొ లైనప్‌లో ఎక్ల్సూజివ్ ఫీచర్స్‌ను యాపిల్ జోడించనుంది. న్యూ ఐఫోన్ `5 ప్రొ మోడల్స్ కీలక అప్‌గ్రేడ్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయని సమాచారం.
ట్రెడిషనల్ లైట్నింగ్ పోర్ట్ నుంచి యూఎస్బీ-సీకి మారడంతో పాటు న్యూ పెరిస్కోప్ కెమెరా, యాపిల్ న్యూ ఏ17 చిప్సెట్ వంటి పలు మార్పులతో ఈ హాట్ డివైజ్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ డిజైన్ ఐఫోన్ 14 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్‌ను పోలి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ డివైజ్‌లు వరుసగా 6.1 ఇంచ్, 6.7 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేలతో పాటు డైనమిక్ ఐలండ్ ఫీచర్‌తో రానున్నాయని లీక్‌లు వెల్లడించాయి. ఫ్లాట్ డిస్ప్లేలతో ఈ హాట్ డివైజ్‌లు ఆక్టుకుంటాయి. ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్‌లో వాడే మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ నుంచి సైడ్ ఫ్రేమ్స్‌కు టైటానియం వాడనున్నట్టు చెబుతున్నారు. టైటానియం వాడటంతో ఈ డివైజ్‌లు తేలికగా, మన్నికగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ మెటీరియల్ వాడకంతో ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read More :
Fake Univerisities | ఈ 20 యూనివర్సిటీల్లో అస్సలు చేరకండి.. స్టూడెంట్స్‌కు యూజీసీ వార్నింగ్