IPhone 15 | ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది టెక్ ప్రియులు కోరుకుంటారు. ఏటా న్యూ వేరియంట్ లాంఛ్ అయిన ప్రతిసారీ యాపిల్ న్యూ డివైజ్‌ను తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎంతోమంది వేచిచూస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 (IPhone 15) లాంఛ్ అయింది. ఇక 128జీబీ ఐఫోన్ 15 లాంఛ్ సమయంలో రూ. 79,900 పలకగా, 256జీబీ వేరియంట్ రూ. 89,900 512జీబీ వేరియంట్ రూ. 1,09,900 పలికింది.
ఇక అమెజాన్ ప్రస్తుతం లేటెస్ట్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 15 ధర మరింత తగ్గనుంది. ఐఫోన్ 15 128జీబీ వేరియంట్ అమెజాన్‌లో ప్రస్తుతం రూ. 74,900కే లభించనుండగా, 256జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 84,900కు, 512జీబీ వేరియంట్ ఆప్షన్ రూ. రూ. 1,04,900కు అందుబాటులో ఉంది. దీనికి తోడు పలు ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ హాట్ డివైజ్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఫోన్‌ను కొనుగోలు చేయడంతో పాటు ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కు మారితే రూ. 7000 ఇన్స్టంట్ తగ్గింపును పొందడం వంటి ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లను అందుకోవచ్చు. ఇక ఐఫోన్ 15 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ డిస్ప్లేతో పింక్, యల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 డైనమిక్ ఐలండ్ నాచ్‌తో 48ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్, ఆల్ డే బ్యాటరీ లైఫ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది.
Read More :