IPhone 14 | సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 మ్యాక్స్ లాంఛ్..హాట్ ఫీచర్లు ఇవే..!
ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఐఫోన్ 14 గురించి యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా రానున్న ఐఫోన్ 14 మోడల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి పలు లీకులు వెల్లడయ్యాయి.
ఈ ఏడాది ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్ లాంఛ్ అవుతుందని చెబుతున్నారు. అందుబాటు ధరలో ప్రొ మోడల్స్ ఫీచర్లతో ఐఫోన్ 14 మ్యాక్స్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. ప్రొ మ్యాక్స్ వెర్షన్‌ను పోలిన విధంగా ఐఫోన్ 14 మ్యాక్స్ భారీ డిస్ప్లేను ఆఫర్ చేస్తుండగా వెనిల్లా ఐఫోన్ 14 మోడల్ తరహాలో ఇతర ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.
ఐఫోన్ 14 మ్యాక్స్ 6.7 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లేతో పాటు పిల్ షేప్డ్ నాచ్ డిజైన్‌ను కలిగిఉంటుంది. ఐఫోన్ 14 మ్యాక్స్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందించేలా ఐఫోన్ 13 కంటే ఐఫోన్ 14 సిరీస్‌లో బ్యాటరీ సామర్ధ్యం అధికంగా ఉండనుంది. ఇక ఐఫోన్ 14 మోడల్స్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో రానున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

