బీజింగ్ : జీరో కొవిడ్ పాలసీలో భాగంగా చైనా కఠిన లాక్డౌన్లు విధించడంతో ఐఫోన్ 14 లాంఛ్లో జాప్యం జరగవచ్చని భావిస్తున్నారు. చైనా లాక్డౌన్ల నేపధ్యంలో సరఫరాదారులను ఐఫోన్ డెవలప్మెంట్ను వేగవంతం చేయాలని యాపిల్ కోరుతోంది. మొత్తంమీద లేటెస్ట్ ఫోన్లలో ఒక ఫోన్ రిలీజ్ అయినా వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
చైనాలో లాక్డౌన్ల కారణంగా ఈ ఏడాది ఆరంభంలో ఐఫోన్ అసెంబ్లర్ పెగాట్రన్ కార్ప్ షాంఘై, కున్షన్ ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. నగరవ్యాప్తంగా లాక్డౌన్తో ఫైనాన్షియల్ హబ్ షాంఘైలో వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఏడు వారాలుగా షాంఘైలో ఇదే పరిస్ధితి నెలకొంది. వీటికి తోడు ఉక్రెయిన్పై రష్యా దాడులు ఐఫోన్ తయారీదారుల ప్రణాళికలకు విఘాతం కలిగించాయి. ఇవే పరిస్ధితులు కొనసాగితే యాపిల్ న్యూ ఫోన్ల ఉత్పత్తి, సరఫరాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని నిక్కీ రిపోర్ట్ వెల్లడించింది.