I-Phone 14 Discounts | గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి టెక్ దిగ్గజం ఆపిల్ విడుదల చేసిన ఐ-ఫోన్ -14 ధర రూ.79,990. ఇది ఐ-ఫోన్, ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 14ప్రో, ఐ-ఫోన్ 14 ప్రో మ్యాక్స్ వర్షన్లలో లభిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆపిల్ తమ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నది.
ఆపిల్ ఉత్పత్తులకు థర్డ్ పార్టీ ఆథరైజ్డ్ డీలర్ ఐ-వీనస్ తాజాగా ఐ-ఫోన్ 14 సిరీస్ పోన్లకు ఆఫర్లు ప్రకటించింది. పరిమిత కాలం వరకు రూ.37,900లకే వనీలా ఐ-ఫోన్ 14 లభిస్తుంది. ఐ-వీనస్ స్టోర్ ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.8000, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ.4000 క్యాష్ బ్యాక్ ఆఫర్ కల్పిస్తున్నది. కొనుగోలుదారులు ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ, బోనస్ కలిపి రూ.30 వేల వరకు రాయితీ పొందొచ్చు.
భారత్‌లో 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఐ-ఫోన్ 14 లాంచింగ్ ధర రూ.79,900. దీనిపై ప్రస్తుతం మొత్తం డిస్కౌంట్ రూ.42 వేల వరకు పలుకుతుంది. ఇది 50 శాతం పై మాటే. స్టోర్ డిస్కౌంట్, కార్డ్ అండ్ ఈఎంఐ క్యాష్‌బ్యాక్, ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ తదితర డిస్కౌంట్లు ఇందులో ఉంటాయి. ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్ నికర ధర రూ.46,990లకు లభిస్తుంది. ఐ-ఫోన్ 14 మాదిరిగానే ఐ-వీనస్ డిస్కౌంట్ రూ.9000 పొందొచ్చు.