Infinix Note 50s 5G Plus | వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ అంటే ఒకప్పుడు కేవలం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలోనే ఈ ఫీచర్ లభించేది. కానీ ఇప్పుడు బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. వినియోగదారులు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను కోరుకుంటున్నారు. కనుక వారి అభిరుచుల మేరకు కంపెనీలు కూడా సరిగ్గా ఇలాంటి ఫోన్లనే తయారు చేసి అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫినిక్స్ తాజాగా నోట్ 50ఎస్ 5జి ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.78 ఇంచ్ డిస్ప్లే ఉండగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ డిస్ప్లే కలిగి ఉంది. అమోలెడ్ డిస్ప్లే కావడం వల్ల స్క్రీన్ చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ అల్టిమేట్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ర్యామ్‌ను మరో 8 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఎక్స్ఓఎస్ 15ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, కిడ్స్ మోడ్, పీక్ ప్రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఫోలాక్స్ స్మార్ట్ అసిస్టెంట్ కూడా లభిస్తోంది. దీంతో వాతావరణ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. చాటింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది.
ఈ ఫోన్లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభిస్తోంది. అందువల్ల ఫోన్ అత్యంత నాణ్యతను కలిగి ఉంటుంది. కింద పడినా అంత సులభంగా పగలదు. అలాగే బడ్జెట్ ఫోన్ అయినా ఇందులో ఐపీ64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తోంది. దీన్ని ఇందులో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తోంది. చార్జర్‌ను కూడా బాక్స్‌తోపాటు పొందవచ్చు. ఈ ఫోన్‌ను 100 శాతం చార్జింగ్ చేసేందుకు కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతుందని కంపెనీ తెలియజేసింది. అలాగే 10 వాట్ల రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌కు ఉంది.
ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తోంది. 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌ను వేసుకోవచ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, టైటానియం గ్రే, రూబీ రెడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఏప్రిల్ 24వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఐసీఐసీఐ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా మరో రూ.1000 వరకు తగ్గింపును పొందవచ్చు.