Infinix GT 30 Pro | ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ విభాగంలో తయారీ దారుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో మిడ్ రేంజ్ ఫోన్లకు ప్రస్తుతం డిమాండ్ బాగానే పెరిగింది. కంపెనీలు కూడా ఈ ఫోన్లను తయారు చేసి అందించేందుకు ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా జీటీ 30ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఫ్లాగ్ షిప్ రేంజ్ లాంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. మరో 12 జీబీ వరకు ర్యామ్ ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. దీని వల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా పబ్జి గేమ్ ఆడేవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించామని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 2 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో వెనుక వైపు 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెకండరీ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే 30 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 8, 12 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. రెండు వేరియెంట్లలోనూ 256 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు సపోర్ట్‌ను ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. 5జి, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రొ స్మార్ట్ ఫోన్ కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 12 నుంచి కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు రూ.1199కే జీటీ గేమింగ్ కిట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.2వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తున్నారు.