HP Laptops | సాఫ్ట్వేర్ నిపుణులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెట్ ప్రొఫెషనల్స్, ఇంజినీరింగ్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు లాప్‌టాప్‌లు అత్యవసరం. విభిన్న వర్గాల వారి ఆకాంక్షలకు, అభిరుచులకు అనుగుణంగా టెక్ దిగ్గజ సంస్థలు లాప్‌టాప్‌లు తీసుకొస్తున్నాయి. ఆ జాబితాలోకి హెచ్‌పీ (HP) వచ్చి చేరింది. తాజాగా భారత్ మార్కెట్లోకి మూడు పెవిలియన్ సిరీస్ లాప్‌టాప్‌లు తీసుకొచ్చింది.
వాటిల్లో హెచ్‌పీ (2023) HP 15 (2023), హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 (2023) HP Pavilion x360 (2023), హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 (2023) HP Pavilion Plus 14 (2023) ఉన్నాయి. ఈ మూడు నూతన లాప్‌టాప్‌లు లైట్‌వెయిట్‌తో ఈజీ పోర్టబిలిటీ సామర్థ్యం కలిగి ఉంటాయి. హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 (HP Pavilion x360) మోడల్ 360-డిగ్రీస్ అడ్జస్టబుల్ హింగ్‌తో వస్తున్నది.
ఈ మూడు లాప్‌టాప్‌లు 12, 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు కలిగి ఉంటాయి. ఫింగర్‌ప్రింట్ రీడర్స్‌తో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చాయి. పెవిలియన్ ప్లస్ 14 (Pavillion Plus 14), హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 కూడా ప్రైవసీ కోసం మాన్యువల్ కెమెరా షట్టర్ కలిగి ఉంటాయి.
నాచురల్ సిల్వర్ కలర్‌తో వస్తున్న హెచ్‌పీ లాప్టాప్ 15 (HP Laptop 15) రూ.39,999.
పేల్ రోజ్ గోల్డ్ కలర్లో వస్తున్న పెవిలియన్ ఎక్స్360 (Pavilion x360) ధర రూ.57,999తో ప్రారంభం.
నాచురల్ సిల్వర్ కలర్‌తో కూడిన పెవిలియన్ ప్లస్ 14 (Pavilion Plus 14) ధర రూ.81,999.
ఈ లాప్‌టాప్‌లు వార్మ్ గోల్డ్, స్పృస్ బ్లూ కలర్ ఆప్షన్లలోనూ లభిస్తాయి.
15.6- అంగుళాల ఫుల్ హెచ్డీ (1920 x 1080 పిక్సెల్స్) డిస్ప్లే.
ఎఫ్డీ0012టీయూ (FD0012TU) మోడల్ నంబర్‌తో కూడిన ఇంటెల్ కోర్ ఐ5-1335యూ (Intel Core i5-1335U processor).
విండోస్ 11 (Windows 11) ప్రీ ఇన్స్టాల్డ్తో ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ యూనిట్ (Intel Iris Xe Graphics unit).
8జీబీ డీడీఆర్4 రామ్ (8GB DDR4 RAM) విత్ ఒక టిగాబైట్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ (1TB onboard storage).
41 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ (41 Wh Li-ion battery unit) మద్దతుతోకూడిన వెబ్‌కామ్ సపోర్ట్స్ వైడ్విజన్ 720పీ హెచ్డీ క్వాలిటీ వీడియో.
యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 2 యూఎస్బీ టైప్-ఏ పోర్ట్స్, వన్ హెచ్డీఎంఐ 2.1 పోర్ట్, హెడ్‌ఫోన్/మైక్రో ఫోన్ జాక్
14-అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే
ఇంటెల్ ఐ5-1335 యూ ప్రాసెసర్ (Intel i5-1335U processor) ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ (Iris Xe Graphics).
విండోస్ 11 ప్రీ ఇన్స్టాల్డ్ విత్ మోడల్ నంబర్ 14-ఈకే1009టీయూ (14-EK1009TU).
16జీబీ డీడీఆర్4 రామ్ (8GB DDR4 RAM) విత్ ఒక టిగాబైట్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ (1TB onboard storage).
ఆప్షనల్ రీచార్జబుల్ కోసం ఎంపీపీ 2.0 టిల్ట్ పెన్ (MPP2.0 Tilt Pen).
43 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ సపోర్ట్‌తో హెచ్‌పీ ఇమేజ్ పాడ్ (HP Imagepad) విత్ మల్టీ టచ్ గెస్చర్ సపోర్ట్.
హెచ్‌పీ లాప్టాప్ 15 (2023)తోపాటు వచ్చే పోర్ట్‌లు లభ్యం.
12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-ఎన్305 ప్రాసెసర్ (12th Gen Intel Core i3-N305 processor) విత్ మోడల్ నంబర్ ఈపీ0068టీయూ(EP0068TU).
14-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే.
1080పీ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ (1080p full-HD video recording) సపోర్ట్ చేసే వెబ్‌కామ్ విత్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ (Intel UHD Graphics).
8జీబీ డీడీఆర్4 రామ్ (8GB DDR4 RAM) 16 జీబీ వరకు విస్తరించవచ్చు. 512 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ.
41 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ.
మిగతా లాప్‌టాప్‌లకు వచ్చే పోర్ట్లే వాడవచ్చు.