HP Omnibook 5 | బడ్జెట్ ధరలోనే భారీ బ్యాటరీ బ్యాకప్ వచ్చే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే ల్యాప్‌టాప్ తయారీ సంస్థ హెచ్‌పీ మీ కోసమే రెండు నూతన మోడల్స్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. హెచ్‌పీ కంపెనీ ఓమ్నిబుక్ 5, ఓమ్నిబుక్ 3 పేరిట రెండు ల్యాప్‌టాప్‌లను లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లు ఏకంగా 34 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది. రోజువారీ పనుల కోసం ఈ ల్యాప్‌టాప్‌లను అధునాతన ప్రాసెసర్, టెక్నాలజీతో రూపొందించామని హెచ్‌పీ తెలియజేసింది. ఇక ఈ రెండు ల్యాప్‌టాప్‌లలోనూ అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్‌పీ ఓమ్నిబుక్ 3 ల్యాప్‌టాప్‌లో వినియోగదారులకు రెండు రకాల డిస్ప్లే మోడల్స్ వస్తాయి. ఒక మోడల్లో 14 ఇంచుల డిస్ప్లే వస్తుంది. 15.6 ఇంచుల డిస్‌ప్లేతోనూ ఈ మోడల్ లభిస్తుంది. యాంటీ గ్లేర్ ఎల్సీడీ డిస్ప్లేను ఇందులో ఏర్పాటు చేశారు. 250 నిట్స్ వరకు బ్రైట్నెస్ను ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎండీకి చెందిన రైజెన్ ఏఐ 5 340 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 4.8 గిగాహెడ్జ్ వరకు స్పీడ్‌ను అందిస్తుంది. ఏఎండీ రేడియాన్ 840ఎం గ్రాఫిక్స్ ఉన్నాయి. మల్టీమీడియా పనుల కోసం ఈ ల్యాప్‌టాప్ చక్కగా పనిచేస్తుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ల్యాప్‌టాప్‌లో లభిస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీలను అందిస్తున్నారు. హెచ్‌పీ ట్రూ విజన్ 1080పి ఫుల్ హెచ్డీ కెమెరా కూడా ఉంది. 1 యూఎస్బీ టైప్ సి పోర్టు, 2 యూఎస్బీ టైప్ ఎ పోర్టులు, 1 హెచ్డీఎంఐ పోర్టు, హెడ్‌ఫోన్ జాక్ పోర్టు ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రొటెక్షన్ కోసం ఫింగర్ ప్రింట్ రీడర్‌ను ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోం 2024 లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో 3 సెల్ కెపాసిటీ కలిగిన 41 వాట్ అవర్ బ్యాటరీని ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్ గ్లేసియర్ సిల్వర్ కలర్ ఆప్షన్లో లాంచ్ అయింది.
హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఓలెడ్ యాంటీ గ్లేర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 300 నిట్స్ వరకు బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ ఎక్స్1 26-100 ప్రాసెసర్ ఇందులో ఉంది. క్వాల్కామ్ అడ్రినో జీపీయూను ఏర్పాటు చేశారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ లేదా 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఈ ల్యాప్‌టాప్‌లో 59 వాట్ అవర్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 34 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక మిగిలిన ఫీచర్లు అన్నీ ఓమ్నిబుక్ 3 ల్యాప్టాప్లోవే ఉన్నాయి.
హెచ్‌పీ ఓమ్నిబుక్ 3 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.68వేలు ఉండగా, హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ల్యాప్ టాప్‌ను రూ.71వేల ప్రారంభ ధరకు అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌తోపాటు హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహని మాట్లాడుతూ హెచ్‌పీ నూతన ఓమ్నిబుక్ ల్యాప్‌టాప్‌లను ఏఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీని యూజర్లకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసినట్లు తెలిపారు. తక్కువ ధరలోనే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ ల్యాప్‌టాప్‌లను అందుబాటులో ఉంచామన్నారు.