Apple iPhone 13 Launch Event : ఈరోజే యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎలా చూడాలి?
ఈరోజే యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్ | యాపిల్ లవర్స్ ఈరోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ ఈరోజు విడుదల చేయనుంది.
వచ్చేసింది.. యాపిల్ లవర్స్ ఈరోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐఫోన్ 13ను యాపిల్ సంస్థ ఈరోజు విడుదల చేయనుంది. దాని కోసం కాలిఫోర్నియా స్ట్రీమింగ్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్.. భారత కాలమానం ప్రకారం 14 సెప్టెంబర్ 2021న రాత్రి 10.30 కు ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

అలాగే.. థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌ను లైవ్‌లోనూ వీక్షించవచ్చు. యాపిల్ యూట్యూబ్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. లేదంటే యాపిల్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా లైవ్ ఈవెంట్‌ను తిలకించవచ్చు. యాపిల్ టీవీ యూజర్లు కూడా ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్‌ను చూడొచ్చు. యాపిల్ పాడ్‌కాస్ట్స్ యాప్‌లోనూ ఈవెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు.

ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్ విడుదల కానున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ మోడల్స్ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానున్నాయి.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు.. ఒక టీబీ స్టోరేజీ కెపాసిటీతో రానున్నాయి. ప్రో మోడల్స్ రీఫ్రెష్ రేట్ 120 హెచ్‌జెడ్‌తో రానున్నాయి.
మరోవైపు యాపిల్ వాచ్ సిరీస్ 7 సరికొత్త డిజైన్‌తో రానుంది. ఫ్లాట్ ఎడ్జ్, లార్జ్ స్క్రీన్, సరికొత్త చిప్‌తో ఈసారి వాచ్‌ను డిజైన్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme 4K Google TV Stick : రియల్మీ నుంచి తొలి టీవీ స్టిక్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో సేల్స్ షురూ
OnePlus Buds Z2: వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

