ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఇన్స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. ఇన్‌స్టా అకౌంట్ లేనివాళ్లు ఇప్పుడు ఉండరు. ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్లతో పాటు.. మిగితా వాళ్లు కూడా ఇన్‌స్టా అకౌంట్‌ను వాడుతున్నారు.
ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే ఇన్‌స్టాకు ఫిదా అయిపోతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా.. ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడమే. ఎక్కువగా సినీ సెలబ్రిటీలు తమ ఫోటోషూట్, సినిమా షూటింగ్‌ల ఫోటోలు, వీడియోలను షేర్ చేసేందుకు ఇన్‌స్టానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. యూత్ కూడా ఎక్కువగా ఇన్‌స్టానే వాడుతుండటంతో.. ఇన్‌స్టాకు రోజురోజుకూ పాపులారిటీ పెరిగిపోతోంది.
అయితే.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేయడం ఎలాగో అందరికీ తెలుసు కానీ.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎలా డిలీట్ చేయాలో మాత్రం చాలామందికి తెలియదు. మీకు ఇంకో విషయం తెలుసా.. ఇన్‌స్టా అకౌంట్‌ను పర్మినెంట్‌గా డిలీట్ చేయకున్నా.. టెంపరరీగా కొన్ని రోజుల పాటు డియాక్టివేట్ చేసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలి? ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఆ తర్వాత ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పక్కనే ఉన్న ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి Temporarily disable my account అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. ఎందుకు అకౌంట్‌ను డిసేబుల్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Temporarily Disable Account బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. అకౌంట్ టెంపరరీగా డిసేబుల్ అవుతుంది. అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోవాలంటే.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు లాగిన్ అయితే చాలు.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను పర్మినెంట్‌గా డిలీట్ చేయడం అంటే.. అంత ఈజీ కాదు. దాని కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. కంపెనీ రివ్యూ చేసి 90 రోజుల్లోగా అకౌంట్‌ను డిలీట్ చేస్తుంది.
దాని కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు లాగిన్ అయి.. https://www.instagram.com/accounts/remove/request/permanent/ ఈ లింక్ ఓపెన్ చేసి అందులో ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారో కారణం తెలపాలి.
ఆ తర్వాత Permanently Delete My Account ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిక్వెస్ట్ పెట్టిన 30 రోజుల తర్వాత.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేస్తుంది. కాకపోతే.. టైమ్‌లైన్‌లో పోస్ట్ చేసిన పోస్టులు అన్నీ డిలీట్ కావడానికి కనీసం 90 రోజుల సమయం పడుతుంది. అకౌంట్ పర్మినెంట్‌గా డిలీట్ అయినా.. ఆ అకౌంట్‌కు సంబంధించిన డేటా మాత్రం ఇన్స్టాగ్రామ్ సర్వర్‌లో ఎప్పటికీ ఉండిపోతుంది. భవిష్యత్తులో ఏదైనా అవసరం అయితే ఆ డేటాను చెక్ చేయడం కోసం ఇన్‌స్టా డిలీట్ అయిన యూజర్లను డేటాను డేటాబేస్‌లో స్టోర్ చేసి ఉంచుతుంది.
ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
WhatsApp Tips : వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ఎవ్వరికీ కనిపించకూడదా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
Tiktok New Challenge : టిక్‌టాక్‌లో కొత్త చాలెంజ్.. ఇది చాలా డేంజర్ గురూ.. ఎందుకంటే?
ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోనే కారు కీ.. డిజిటల్ కీతోనే డ్రైవింగ్
Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్లోడ్ చేసుకోండిలా