న్యూఢిల్లీ : పిక్సెల్ వాచ్ పేరుతో స్మార్ట్ వాచ్‌పై గూగుల్ చాలాకాలంగా కసరత్తు సాగిస్తోంది. గూగుల్ పిక్సెల్ వాచ్ వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో లాంఛ్ అవుతుందని, వాచ్ స్పెసిఫికేషన్లు ఇవేనంటూ ఫోటోలతో పాటు తాజా లీక్‌లు వెల్లడించాయి. గూగుల్ పిక్సెల్ వాచ్ కోడ్పేరు రోహన్ అని తాజా నివేదిక తెలిపింది. కస్టమ్ మేడ్ చిప్సెట్తో పిక్సెల్ వాచ్ కస్టమర్ల ముందుకు త్వరలో వస్తుందని చెబుతున్నారు.
సర్క్యులర్ బెజెల్-లెస్ డిస్ప్లేతో పిక్సెల్ వాచ్ రానుంది. పిక్సెల్ 6 సిరీస్ లభించే దేశాల్లో పిక్సెల్ వాచ్ అందుబాటులో ఉండనుంది. గూగుల్ పిక్సెల్ వాచ్ శాంసంగ్‌తో కలిసి గూగుల్ అభివృద్ధి చేసిన వియర్ ఓఎస్ 3పై రన్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో గూగుల్ పిక్సెల్ వాచ్ ధర దాదాపు రూ 26,300 ఉంటుందని భావిస్తున్నారు.