Google-Anthropic | మనకు తెలియని అంశంపై సమాచారం కావాలంటే నెటిజన్లు.. సాధారణ వ్యక్తులకు ఆధారం గూగులమ్మ Google.. రోజుకో టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణమిది. ప్రత్యేకించి కృత్రిమ మేధ ( Artificial Intelligence – AI) సాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నది ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ (OpenAI). ఈ ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ (ChatGPT) సైతం.. మనందరికీ ఇష్టమైన గూగులమ్మకు ధీటుగా క్షణాల్లో నెటిజన్లు అడిగిన సమాచారం అందుబాటులోకి తెస్తున్నది. కేవలం రెండు నెలల్లో చాట్‌జీపీటీకి వంద మిలియన్ల యూజర్లు కనెక్ట్ అయ్యారు.
ఈ చాట్‌జీపీటీ (ChatGPT) సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టింది. గూగుల్‌తో సమానంగా యూజర్లకు డేటా అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నది. దీంతో అలర్టయింది గూగుల్.. తాను సైతం కృత్రిమ మేధతో రూపుదిద్దుకున్న మరో స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ ( Anthropic ) లో దాదాపు రూ.3289 కోట్లపై చిలుకు (400 మిలియన్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టిందని సమాచారం. కానీ ఆంథ్రోపిక్‌లో పెట్టుబడుల విషయమై గూగుల్ గానీ, ఆంథ్రోపిక్ గానీ స్పందించడానికి నిరాకరించాయి. త్వరలో తమ యూజర్లకు చాట్‌జీపీటీ తరహా సేవలు అందుబాటులోకి తెస్తామని రెండు రోజుల క్రితం గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు.
చాట్ జీపీటీ (ChatGPT) తరహా సేవల కోసం తమ పార్టనర్‌షిప్‌పై గూగుల్, ఆంథ్రోపిక్ సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. దీని ప్రకారం గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఆంథ్రోపిక్ ఉపయోగించుకుంటుందని తెలుస్తున్నది. టెక్ జెయింట్ గూగుల్, ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ మధ్య అలయెన్స్.. క్షణాల్లో టెక్స్ట్, ఆర్ట్ క్రియేట్ చేయగల టెక్నాలజీ ఏఐ అనుబంధ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న అంశం అందరిలో వేడి పుట్టిస్తున్నది.
రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆంథ్రోపిక్‌లో గూగుల్ వాటా తీసుకుంటుంది. కానీ గూగుల్‌లో క్లౌడ్ సర్వీసులను కొనుగోలు చేయడానికి ఆంథ్రోపిక్ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. సదరు సంస్థల మధ్య ఒప్పంద నియమాలు రహస్యంగా ఉంచాలని భావిస్తున్నట్లు తెలిపింది.
అన్ని పరిశ్రమల్లో సర్వీసులు మెరుగు పడటంతోపాటు వృద్ధికి కొత్త అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి అకడమిక్ రీసెర్చ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్.. టెక్నాలజీ రంగంలో మార్పునకు అతిపెద్ద డ్రైవర్‌గా అవతరిస్తున్నది. నెక్ట్స్ జనరేషన్ ఏఐ స్టార్టప్ సంస్థలకు గూగుల్ క్లౌడ్ ఓపెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తుంది. అందుకు ఆంథ్రోపిక్‌తో మా భాగస్వామ్యం గొప్ప ఉదాహరణ` అని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఓ ప్రకటనలో తెలిపారు.
చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త.. ఓపెన్ ఏఐ (OpenAI) మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, డానైలా, డారియో ఆమోడై అనుబంధ సంస్థలతో కలిసి 2021లో ఆంథ్రోపిక్ ఏఐ ఏర్పాటైంది. అత్యంత ప్రజాదరణ పొందిన చాట్ జీపీటీ (ChatGPT) కి పోటీగా క్లౌడ్ అనే పేరుతో రూపొందించిన న్యూ చాట్‌బోట్‌ను గత నెలలో పరీక్షించారు. ఓపెన్ ఏఐ (OpenAI) లో మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి నేపథ్యంలో గూగుల్-ఆంథ్రోపిక్ భాగస్వామ్యం రూపుదిద్దుకున్నట్లు తెలుస్తున్నది.