Google Chrome | టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన క్రోమ్ బ్రౌజర్లో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. కొత్తగా స్మార్ట్ అలర్ట్ కంట్రోలర్ ఫీచర్‌ను జోడించినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ యూజర్లు చాలాకాలంగా ఇంటరాక్ట్ అవ్వని వెబ్సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయనున్నది. బ్రౌజింగ్‌లో తరుచూ అంతరాయం కలిగించే అనవసరమైన పాప్ అప్ వార్నింగ్స్‌ను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ అప్డేట్ను ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్లో విడుదల చేయనున్నది. క్రోమ్ ప్రస్తుతం ప్రైవసీ టూల్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది.
కొత్త ఫీచర్ విషయానికి వస్తే.. ఈ ఫీచర్ క్రోమ్ సేఫ్టీ చెక్ సిస్టమ్‌లో భాగమని బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. వెబ్సైట్స్ల నుంచి కెమెరా, లొకేషన్ వంటి అనుమతులను తొలగించింది. తాజాగా నోటిఫికేషన్ అనుమతిని ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. ఇంటర్నల్ క్రోమ్ డేటా.. ఒకశాతం కంటే తక్కువ మంది వినియోగదారులు వాస్తవానికి వెబ్ నోటిఫికేషన్లతో ఇంటరాక్ట్ అవుతున్నారని పేర్కొంది. క్రోమ్ తాజాగా యూజర్ సౌలభ్యం కోసం ఆటోమేటిక్ నోటిఫికేషన్ నియంత్రణలను అమలు చేస్తోంది. ఈ మార్పు అన్ని వెబ్సైట్లకు సమానంగా వర్తించదని గూగుల్ స్పష్టం చేసింది. తక్కువ యూజర్ ఎంగేజ్మెంట్ ఉన్న.. హై నోటిఫికేషన్ అవుట్‌పుట్ ఉన్న సైట్లకు మాత్రమే నోటిఫికేషన్లు నిలిపివేయబడతాయని పేర్కొంది. వెబ్ యాప్‌లుగా యూజర్ ఇన్స్టాల్ చేసిన వెబ్సైట్ల నుంచి నోటిఫికేషన్లు ప్రభావితం కావని చెప్పింది. ఒక సైట్ నుంచి అనుమతులు రద్దు చేయబడితే.. క్రోమ్ ఈ విషయాన్ని యూజర్లకు తెలియజేస్తుంది.
వినియోగదారులు ప్రైవసీకి వెళ్లడం, వెబ్సైట్లను తిరిగి ఓపెన్ చేసిన సందర్భంలో మళ్లీ నోటిఫికేషన్‌ను తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ పూర్తిగా వినియోగదారుల నియంత్రణలోనే ఉంటుందని చెప్పింది. వినియోగదారులు మార్పును కోరుకోకపోతే ఆటోమేటిక్‌గా రివోక్సేషన్ ఫీచర్‌ను కూడా పూర్తిగా నిలిచిపివేయవచ్చని చెప్పింది. ఫీచర్ టెస్టింగ్ సమయంలో నోటిఫికేషన్ ఓవర్‌లోడ్ గణనీయంగా తగ్గిందని.. యూజర్ క్లిక్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని గూగుల్ చెబుతున్నది. ఆసక్తికర విషయం ఏంటంటే.. తక్కువ నోటిఫికేషన్స్ పంపే వైబ్‌సైట్స్ యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచాయని.. దీనర్థం ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపశమనం కలిగించడమే కాకుండా వెబ్సైట్లను మరింత ఆలోచనాత్మకంగా నోటిఫికేషన్లను పంపేలా ప్రోత్సహిస్తుందని గూగుల్ చెప్పుకొచ్చింది.