మంగళవారం 20 అక్టోబర్ 2020
Science-technology - Sep 26, 2020 , 16:16:55

ల్యాబ్‌లో యాంటీబాడీస్‌ తయారు : ఇక కరోనా పరారు

ల్యాబ్‌లో యాంటీబాడీస్‌ తయారు : ఇక కరోనా పరారు

బెర్లిన్‌ : కరోనా వైరస్‌ నుంచి మానువులను రక్షించే పనిలో దాదాపు అన్ని దేశాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండగా.. జర్మన్ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి ప్రయోగశాలలో కరోనాతో పోరాడే యాంటీబాడీస్‌లను తయారు చేశారు. ప్రస్తుతం ఎలుకలపై జరుపుతున్న ప్రయోగాలు విజయం సాధించిన అనంతరం మానవులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యాంటీబాడీతో నిష్క్రియాత్మక వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. నిష్క్రియాత్మక టీకా కింద శాస్త్రవేత్తలు ఈ యాంటీబాడీలను కరోనా బాధితుడి శరీరంలోకి పంపిస్తారు. ఇది కరోనాతో పోరాడటానికి వారికి సహాయపడుతుంది.

పరిశోధన నిర్వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరోడెజెనరేటివ్ డిసీజెస్ శాస్త్రవేత్తలు.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి 600 రకాల యాంటీబాడీలను వేరుచేశారు. ప్రయోగశాలలో పరీక్షించిన తరువాత ఈ క్రియాశీల ప్రతిరోధకాలు కొరోనాతో పోరాడటంలో సమర్థంగా నిరూపించగలవని కనుగొన్నారు. సెల్ కల్చర్‌ సహాయంతో ప్రయోగశాలలో యాంటీబాడీని తయారుచేశారు. ప్రయోగశాలలో తయారుచేసిన న్యూట్రిఫైయింగ్ యాంటీబాడీస్ కరోనాను బంధించడానికి పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇది కరోనా శరీరంలోకి ప్రవేశించకుండా, పెరగకుండా నిరోధిస్తుంది. ఈ యాంటీబాడీ సహాయంతో శరీరం యొక్క రోగనిరోధక కణాలు కరోనాను తొలగిస్తాయని పరిశోధన పేర్కొన్నది.

ఈ యాంటీబాడీలు ఎలుకలపై ప్రభావవంతంగా ఉన్నట్లు నిరూపించబడింది. ఎలుకలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు సమాచారం. కరోనా సోకిన ఎలుకలు ఈ యాంటీబాడీ యొక్క తేలికపాటి ప్రభావాన్ని చూపించగా.. వ్యాప్తికి ముందు ఈ యాంటీబాడీలను ఇంజెక్ట్ చేసిన ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నాయి. సెల్ అనే జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. ఎలుకలలో ఉండే కణాలు మానవ కణాలను పోలి ఉంటాయి. కాబట్టి ఈ యాంటీబాడీలు రోగులకు కూడా ప్రభావవంతంగా ఉంటాయని తేలింది.

యాంటీబాడీలు బీ-లింఫోసైట్లు అనే ప్రోటీన్లతో తయారైన రోగనిరోధక కణాలు. ఏదైనా బయటి వస్తువు (ఫారిన్‌ బాడీస్‌) శరీరానికి చేరినప్పుడల్లా అవి అప్రమత్తమవుతాయి. ఈ ప్రతిరోధకాలు బ్యాక్టీరియా లేదా వైరస్‌ల విషాన్ని తటస్తం చేస్తాయి. ఈ విధంగా రోగుల శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం ద్వారా అన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావం నుంచి బయటపడవచ్చు.


logo