న్యూఢిల్లీ : మెరుగైన పెర్ఫామెన్స్, వేగం, బ్యాటరీ సామర్ధ్యం కలిగి అందుబాటు ధరలో ఉండే ల్యాప్‌టాప్‌ల (Best Laptops) ఎంపిక ఏమంత సులభం కాదు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తే ధరలో రాజీపడటమో, ధర తక్కువగా ఉండేందుకు ఫీచర్లతో రాజీపడటమో జరుగుతుంటుంది. అయితే మీడియం బడ్జెట్‌ను వెచ్చించే కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన ల్యాప్టాప్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.
ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ హెచ్‌పీ, లెనోవా, ఆసుస్ వంటి ప్రముఖ బ్రాండ్లు న్యూ ల్యాప్‌టాప్స్‌ను లాంఛ్ చేయగా షియామి, రియల్మీ, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్ల నుంచి ఇటీవల ఎలాంటి న్యూ మోడల్స్ మార్కెట్లో సందడి చేయలేదు. ఈ బ్రాండ్లు త్వరలోనే యూనిక్ లాంఛ్‌లతో కస్టమర్ల ముందుకొచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్ల కోసం మార్కెట్లో పలు నోట్‌బుక్స్, ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 50,000లోపు మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కూడా విరివిగా లభిస్తున్నాయి.
విద్యార్ధుల కోసం హెచ్‌పీ 15ఎస్, లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 6 మెరుగైన ఆప్షన్స్ కాగా, ప్రొఫెషనల్స్‌కు వివోబుక్ 16x పవర్ఫుల్, వెర్సటైల్ ల్యాప్‌టాప్‌గా టెక్ నిపుణులు సూచిస్తున్నారు. డిజైన్‌పై ఫోకస్ అధికంగా ఉండే కస్టమర్లకు ఎంఐ నోట్‌బుక్ ప్రో మెరుగైన ఎంపిక. రూ. 50,000లోపు మార్కెట్లో లభించే ఫైవ్ బెస్ట్ ల్యాప్‌టాప్స్‌ను పరిశీలిస్తే..
హెచ్‌పీ 15ఎస్ రూ. 47,999
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 6 రూ. 48,990
ఆసుస్ వివోబుక్ ఫ్లిప్ 14 రూ. 44,990
ఆసుస్ వివోబుక్ 16X రూ. 49,990
ఎంఐ నోట్‌బుక్ ప్రో రూ. 50,999
Read More
Oppo F23 5G | 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్23 5జీ లాంఛ్ : ధర ఎంతంటే..!