న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ (ChatGpt), బార్డ్ వంటి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఈ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొంది. ఏఐ రాకతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతాయని కొందరు టెక్ సీఈవోలు బాంబు పేల్చుతుండగా మరికొందరు సీఈవోలు ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని భరోసా ఇస్తున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ వణికిస్తున్న క్రమంలో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సీఈవో నితిన్ కామత్ తమ సంస్ధలో ఉద్యోగుల ఫైరింగ్ ఉండదనే తీపికబురు చెప్పినా ఏఐ టూల్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏఐ కొన్ని ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని స్పష్టం చేశారు. ఏఐతో కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కొన్ని రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి ఏఐ టూల్స్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఈ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.
న్యూ టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయని, సమాజం విచ్ఛిన్నపోకడలు తలెత్తుయానే భయాలు ఉన్నా తమ కంపెనీలో న్యూ టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగుల కొలువులు భద్రంగానే ఉంటాయని ఊరట కల్పించారు. పలు కంపెనీలు ఏఐ పేరుతో ఉద్యోగులను తొలగించవచ్చని, న్యూ టెక్నాలజీల ద్వారా కంపెనీలు లబ్ధి పొంది వాటి వాటాదారులను సంపన్నులుగా మార్చినా సంపద పంపిణీలో అసమానతలు పెరుగుతాయని అన్నారు. ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More