Elon Musk | వర్క్ ఫ్రం హోం కల్చర్‌పై మరోసారి మండిపడ్డ మస్క్
వర్క్ ఫ్రం హోం పద్ధతిని వ్యతిరేకించే ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ (Elon Musk) తాజాగా మరోసారి ఇంటి నుంచి పనిచేసే కల్చర్‌పై విమర్శలు గుప్పించారు.
న్యూయార్క్ : కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో టెకీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతుండగా కొందరు ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం పద్ధతిని వ్యతిరేకించే ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ (Elon Musk) తాజాగా మరోసారి ఇంటి నుంచి పనిచేసే కల్చర్‌పై విమర్శలు గుప్పించారు.
ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌తో కసరత్తు సాగించడం ఉత్పాదకతపై ప్రభావం చూపడమే కాకుండా ఈ వెసులుబాటు లేని ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించారు. కార్లు తయారుచేసే వారు, సర్వీసింగ్ సిబ్బంది, ఇండ్లు కట్టే కార్మికులు, మరమ్మత్తులు చేసేవారు, ఆహారం తయారు చేసేవారు మనం వాడే వస్తువులన్నింటినీ తయారు చేసేవారంతా విధిగా పని ప్రదేశాలకు వెళతారని, మీరు మాత్రం ఇంఇ నుంచే పని చేస్తారని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఇది ( వర్క్ ఫ్రం హోం) కేవలం ఉత్పాదకతకు సంబంధించిన అంశమే కాదని, నైతికంగా కూడా సరైంది కాదని మస్క్ స్పష్టం చేశారు. కార్యాలయాలకు ఉద్యోగులు తిరిగి రావాలని గట్టిగా కోరే మస్క్ గత వేసవిలో టెస్లా ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని హెచ్చరించారు. ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆఫీస్‌లో గడపాలని కోరారు.
Read More
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

