Earth from moon | జాబిలిపై పరిశోధనలు చేసేందుకు అమెరికా నాసా పంపిన ఆర్టెమిస్-1 విజయవంతంగా పనిచేస్తున్నది. ఓరియన్ వ్యోమనౌక చంద్రుడికి వెనుకకు 60,000 కిలోమీటర్లకు పైగా తిరోగమన కక్ష్యలోకి ప్రవేశించే మార్గంలో ఉన్నది. సైన్స్ , ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణించే ఈ అంతరిక్ష నౌక.. చంద్రుడి నుంచి పంపిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఎనిమిది రోజుల క్రితం అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఓరియన్ క్యాప్సూల్ చందమామ ఫొటోలు, వీడియోలను భూమిపైకి పంపింది. వీటిలో ఎర్త్ రైజ్పేరుతో నాసా ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో రెండున్నర నిమిషాల నిడివితో ఉన్నది. ఈ వీడియోలో చంద్రుడు నీలం రంగులో చిన్న బంతిలా పైకి రావడం చూడొచ్చు. ఈ వీడియో నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
ఓరియన్ అంతరిక్ష నౌక ప్రస్తుతం చంద్రుడి గురుత్వాకర్షణ గోళం నుంచి బయటపడిందని, అన్నీ సవ్యంగా జరిగి క్యాప్సూల్‌ను సరైన కక్షలో పెట్టేందుకు రేపు మరోసారి ‘ఇంజిన్ ఫైరింగ్’ చేయనున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్టెమిస్-1 విజయవంతం కావడంతో ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 మిషన్లలో మానవులను చంద్రుడిపైకి పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తున్నది.