బుధవారం 03 జూన్ 2020
Science-technology - Apr 02, 2020 , 15:08:43

బీఎస్‌ 6 వాహనాలపై కరోనా దెబ్బ

బీఎస్‌ 6 వాహనాలపై కరోనా దెబ్బ

హైదరాబాద్ : బీఎస్ 6 వాహనాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడం తో నూతన వాహనాలను తయారు చేసిన పలు ఆటోమొబైల్ సంస్థలు వాటిని మార్కెట్ లోకి విడుదల చేయలేకపోయాయి. లాక్ డౌన్ వల్ల బీఎస్ 6 వాహనాలు అన్ని కూడా మార్కెట్లోకి ఆలస్యంగా రానున్నాయి. వాటిలో కొన్ని .... 

2020 ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్ 

ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్ బీఎస్6 మోడల్ తో పోలిస్తే బీఎస్6 మోటార్ సైకిల్ లో కొన్ని మార్పులు చేసింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 2020 ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్ బైక్ ను రూపొందించింది. 

 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్..

హీరో సంస్థ ఈ బైక్ ను ఫిబ్రవరిలోనే లాంచ్ చేసింది. అయితే ఎక్స్ ట్రీమ్ 160ఆర్ మోడల్లో కొత్త తరం బైక్ గా ముందుకు వచ్చిన ఈ మోటర్ సైకిల్ ని మన భారత్ లో మార్చిలో విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

 బీఎస్6 బెనెల్లీ ఇంపీరియల్ 400 

ఇటలీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ నూతన వాహనాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.    " ఇంపీరియల్ 400" పేరుతో  సరికొత్తమోడల్ ఈ అక్టోబరులో తీసుకురావాలని నిర్ణయించింది కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అది మరో ఏడాది ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది.  దీని  ధర రూ.1.79 లక్షలు .logo