నిలిచిన చైనా అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్
సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రానికి పంపాల్సిన టియాన్జౌ 2 అంతరిక్ష నౌకను చైనా వాయిదా వేసింది

బీజింగ్ : సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రానికి పంపాల్సిన టియాన్జౌ 2 అంతరిక్ష నౌకను చైనా వాయిదా వేసింది. మానవరహిత సరుకు అంతరిక్ష నౌక సరఫరా మిషన్‌లో భాగంగా దీనిని గురువారం ఉదయం ప్రయోగించాల్సి ఉన్నది. ఈ సమాచారం చైనా అంతరిక్ష కేంద్రం నుంచి అందింది. అయితే తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తారనే విషయం తెలియలేదు. చైనా తియాన్హే అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో టియాన్జౌ 2 ఒక భాగం. ఇంతకు ముందు ప్రారంభించిన టియాన్హె కోర్ మాడ్యూల్ కోసం ఇది మొదటి కార్గో సరఫరా మిషన్.
సరఫరా మిషన్ నిలిచిపోవడానికి గల స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ.. కొత్త ప్రయోగ సమయం త్వరలోనే నిర్ణయిస్తారని జిన్హువా వార్తాసంస్థ నివేదించింది. ఇప్పుడు ఆలస్యం అయిన మిషన్‌లో ఆహారం, స్పేస్ సూట్లు వంటి నిత్యావసరాలను కోర్ మాడ్యూల్‌కు తీసుకెళ్లాల్సి ఉన్నది. “స్వర్గపు ప్యాలెస్” అని అర్ధం ఉన్న తియాన్హే అనే అంతరిక్ష కేంద్రం – కక్ష్యలో అసెంబ్లీని పూర్తి చేయడానికి మొత్తం 10 మిషన్లు అవసరం. ఈ అంతరిక్ష కేంద్రం 15 సంవత్సరాల వరకు తక్కువ భూమి కక్ష్యలో ఉండి సేవలందించేలా చైనా రూపొందించింది.
లాంగ్ మార్చి 5 బీ శిధిలాలు భూమిపై పడినప్పుడు చైనా అంతరిక్ష కార్యక్రమం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. ఈ రాకెట్ నియంత్రణ కోల్పోవడంతో ఎక్కడ పడిపోతుందో చెప్పడం కూడా కష్టంగా మారింది. చివరకు హిందూ మహాసముద్రంలో ఎటువంటి నష్టం లేకుండా పడిపోవడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. అంతరిక్ష శిధిలాలకు సంబంధించి ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని నాసా అడ్మినిస్ట్రేటర్ సేన్ బిల్ నెల్సన్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

