బీజింగ్: తొలి ప్రయత్నంలోనే మార్స్‌పై రోవర్‌ను దింపిన తొలి దేశంగా ఘనతను సొంతం చేసుకున్న చైనా.. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఝురోంగ్ రోవర్ మే నెలలో మార్స్‌పై ల్యాండైంది. చైనా అగ్ని దేవుడి పేరు మీదుగా దీనికి ఈ ఝురోంగ్ అనే పేరు పెట్టారు. అక్కడ ల్యాండైనప్పటి నుంచీ యుటోపియా ప్లానీషియాగా పిలిచే మార్స్ లావా మైదానాలను ఈ రోవర్ అధ్యయనం చేస్తోంది. ఝురోంగ్ రోవర్ మార్స్‌పై అటూఇటూ తిరిగినప్పుడు పడిన ముద్రల ఫొటోను రిలీజ్ చేస్తూ.. మార్స్‌పై చైనా ముద్ర పడిందంటూ అక్కడి నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కామెంట్ చేసింది.
సోలార్ పవర్‌తో పని చేసే ఈ రోవర్ బరువు 240 కిలోలు. ఇది మార్స్‌పై మూడు నెలల పాటు ఉండనుంది. అక్కడి ఫొటోలు తీస్తూ, మట్టి నమూనాలను సేకరిస్తూ గడపనుంది. ఇప్పటి వరకూ రోవర్ తాము అంచనా వేసినట్లు పని చేస్తోందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే స్పేస్‌లోకి మనుషులను పంపిన చైనా, చంద్రుడిపైకి కూడా స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించింది. తాజాగా మార్స్‌పై తన రోవర్‌ను ల్యాండ్ చేయడం ద్వారా అంతరిక్షంలో తనదైన ముద్ర వేయగలిగింది. చైనా కాకుండా మార్స్‌పై రోవర్‌ను దింపి విజయవంతంగా నడిపింది అమెరికా మాత్రమే.
Family photo! First batch of scientific images of #Zhurong rover landing on Mars unveiled. Fig 1 was taken by a wireless camera deployed by rover. Fig 3 shows traces of rover maneuver. Full scale HD pictures and Easter eggs are revealed by @CNSAWatcher in https://t.co/jCzeJVk5iD pic.twitter.com/j7sFT39M45
— Chinese Zhurong Mars Rover (@MarsZhurong) June 11, 2021