Nothing Phone 1 | ఆపిల్ ఐ-ఫోన్‌కు పోటీగా నథింగ్ అనే స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ తీసుకొచ్చిన తొలి ఫోన్ కొనుగోలుదారులపై ఆఫర్ల వర్షం కురుస్తున్నది. గత జూలైలో నథింగ్ ఫోన్-1 మార్కెట్లోకి వచ్చి నథింగ్-1 ఆకర్షణీయమైన డిజైన్‌తో కస్టమర్ల మనస్సు దోచేసింది. సగం ధరకే ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేసే సౌకర్యం ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తున్నదని నథింగ్ సీఈవో కార్ల్ పై చెప్పారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా.. !
ప్రస్తుతం నథింగ్ ఫోన్-1 ధర రూ.37,999 మాత్రమే. ఎక్కువ ధర అని ఆందోళన గురి కాకుండా ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్.. కస్టమర్లకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నది. దీంతో నథింగ్-1 ఫోన్ రూ.15,499లకే కస్టమర్లకు అందదుబాటులోకి వస్తుంది. 112జీబీ రామ్ ప్లస్ 256 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 37,999 పలికితే, క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ రూపంలో ఫ్లిప్‌కార్ట్ రూ.5000 తగ్గిస్తున్నది. అంటే నథింగ్-1 ఫోన్ రూ.32,999. పాత ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.17,500 ధర తగ్గించింది. అయితే, ఎక్స్చేంజ్ ఫోన్ పనితీరును బట్టి ఆఫర్ ఖరారవుతుంది.
ఎక్స్చేంజ్ ఆఫర్ తక్కువగా ఉంటే నథింగ్ ఫోన్-1 ధరలో తేడాలు ఉంటాయి. వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొన్న వారికి ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ మీద 25 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. అలాగే, రూ.6,699 విలువ గల గూగుల్ ఆడియోను పొందొచ్చు.
నథింగ్ ఫోన్1-1లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఓఎల్ఈడీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్-5 కవర్, స్నాప్ డ్రాగన్ 778 జీ + ప్రాసెసర్‌తోపాటు బ్యాంక్ రెండు 50 మెగా పిక్సెల్ (ఎంపీ) కెమెరాలు, ఫ్రంట్‌లో 16 ఎంపీల సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 సామర్థ్యం గల ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.