న్యూఢిల్లీ : అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన కెమెరా, భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన లేటెస్ట్ అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో కూడిన స్మార్ట్ఫోన్లపై ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడని కస్టమర్లు పెరుగుతుండటంతో ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను పెద్దసంఖ్యలో ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సైతం పోటీపడుతున్నాయి.
రూ లక్ష లోపు హైఎండ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లు కండ్లు చెదిరే ఫీచర్లతో కస్టమర్ల ముందున్నాయి. హార్డ్‌వేర్, ఫీచర్ల విషయంలో రాజీ పడకుండా ఉండే స్మార్ట్ఫోన్లపై ఎంతైనా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతుండటంతో ప్రీమియం బ్రాండ్ల లభ్యతను పెంచేందుకు కంపెనీలు సైతం కసరత్తు సాగిస్తున్నాయి. ఇక భారత్‌లో ప్రస్తుతం లభిస్తున్న అయిదు హైఎండ్ ప్రీమియం స్మార్ట్పోన్ల బేసిక్ మోడల్ వివరాలు గమనిస్తే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా : రూ .1,00,000
ఐఫోన్ 14 ప్రొ : రూ. 1,29,000
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ : రరూ . 1,54,000
గూగుల్ పిక్సెల్ 7 ప్రొ : రరరూ 84,199
వివో ఎక్స్80 ప్రొ : రూ 79,999