Asus Zenbook 14 | తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అసుస్ సంస్థ రెండు నూతన ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. జెన్‌బుక్ 14, వివోబుక్ ఎస్16 పేరిట ప్రీమియం సెజ్‌మెంట్‌లో రెండు నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లను అల్ట్రాపోర్టబుల్ డిజైన్‌తో రూపొందించారు. కేవలం 1.2 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటాయి. వివోబుక్ ఎస్16 మోడల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255హెచ్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అసుస్ జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌లో ఏఎండీ రైజెన్ ఏఐ 5 340 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్స్డీఎన్ఏ ఎన్‌పీయూను అందిస్తున్నారు. అందువల్ల ఏఐ వర్క్ లోడ్‌కు తగినట్లుగా ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో 16జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ లభిస్తుంది.
జెన్‌బుక్ 14 ల్యాప్ టాప్‌లో 14 ఇంచుల 3కె ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఏఎండీ రేడియాన్ గ్రాఫిక్స్‌ను అందిస్తుండగా, 75 వాట్ అవర్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీని సహాయంతో ఒక రోజుకు కావల్సిన బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక అసుస్ వివోబుక్ ఎస్16 ల్యాప్‌టాప్‌ను చాలా లైట్ వెయిట్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. మెటల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255హెచ్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 16 ఇంచుల డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐపీఎస్ డిస్ప్లే కావడం, ఫుల్ హెచ్డీకి సపోర్ట్‌ను అందిస్తుండడంతో డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యమైన దృశ్యాలను దీనిపై వీక్షించవచ్చు.
అసుస్ జెన్‌బుక్ 14 ల్యాప్ టాప్‌లో విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ వెర్షన్‌ను అందిస్తున్నారు. 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఏడాదిపాటు ఉచితంగా లభిస్తుంది. ఆఫీస్ హోమ్ 2024 వెర్షన్‌ను లైఫ్ టైమ్ వాలిడిటీతో అందిస్తున్నారు. ముందు వైపు ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఉంది. విండోస్ హలోకు సపోర్ట్ లభిస్తుంది. యూఎస్బీ టైప్ ఎ, టైప్ సి, హెచ్డీఎంఐ, 3.5ఎంఎం జాక్ పోర్టులు ఇందులో ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ 5.3 లభిస్తుంది. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో దీన్ని రూపొందించారు. 17 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే అసుస్ వివోబుక్ ఎస్16లోనూ ఇంతకు ముందు తెలిపిన ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. కానీ ప్రాసెసర్, డిస్ప్లే, గ్రాఫిక్స్ వంటి ఆప్షన్లలో మార్పులు ఉన్నాయి.
ఇక అసుస్ జెన్‌బుక్ 14 ప్రారంభ ధర రూ.89,990 ఉండగా, అసుస్ వివోబుక్ ఎస్16 ప్రారంభ ధర రూ.87,990గా ఉంది. ఈ ల్యాప్ టాప్‌లను అమెజాన్‌తోపాటు అసుస్ ఆన్లైన్ స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయగా వీటిపై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను సైతం అందిస్తున్నారు.