Asus Vivobook S16 | అత్యంత చవక ధరకే ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా. అయితే అసుస్ కంపెనీ మీ కోసమే రెండు నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వివోబుక్ ఎస్16 పేరిట ఓ ఏఐ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయగా, క్రోమ్‌బుక్ సిఎక్స్15 పేరిట మరో ల్యాప్‌టాప్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఈ ల్యాప్‌టాప్‌లలో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించడమే కాదు, ధర కూడా తక్కువగానే ఉంది. ఈ రెండింటిలోనూ వినియోగదారులకు ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. వివోబుక్ ఎస్16 ల్యాప్ టాప్‌ను మెటాలిక్ డిజైన్‌తో రూపొందించారు. కేవలం 1.59 సెంటీమీటర్ల మందం మాత్రమే కలిగి ఉండి అత్యంత పలుచగా ఉంటుంది. అందువల్ల ల్యాప్ టాప్కు ప్రీమియం లుక్ వచ్చింది. బరువు కూడా కేవలం 1.74 కిలోలు మాత్రమే ఉండడం విశేషం.
వివోబుక్ ఎస్16 ల్యాప్ టాప్‌లో 16 ఇంచుల ల్యూమినా ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ల్యాప్ టాప్‌లో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కోపైలట్ ప్లస్ ఏఐ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. లైవ్ క్యాప్షన్స్, విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్, అసుస్ ఎక్స్‌క్లూజివ్ ఏఐ యాప్స్, స్టోరీ క్యూబ్ వంటి యాప్స్‌ను, ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. ఇందులో 70 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఏకంగా 32 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా అసుస్ ఐస్కూల్ థర్మల్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ల్యాప్‌టాప్‌ను ఎంత ఎక్కువగా ఉపయోగించినా త్వరగా వేడికి గురి కాకుండా ఉంటుంది.
వివోబుక్ ఎస్ 16 ల్యాప్ టాప్‌లో ముందు భాగంలో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కలిగిన ఇన్ఫ్రారెడ్ వెబ్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రైవసీ షటర్ కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2024 సాఫ్ట్వేర్ ఇందులో లైఫ్ టైమ్ వాలిడిటీతో లభిస్తుంది. వన్‌డ్రైవ్ 100జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నారు. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. 16జీబీ ర్యామ్‌ను ఇస్తున్నారు. 512జీబీ స్టోరేజ్ లభిస్తుంది. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి పోర్టులు, హెచ్డీఎంఐ పోర్టు, ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు. ఇక క్రోమ్‌బుక్ సీఎక్స్ 15 ల్యాప్ టాప్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల ఈ ల్యాప్‌టాప్ అంత సులభంగా పగలదు. ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్ ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 13 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
క్రోమ్‌బుక్ సీఎక్స్15 ల్యాప్‌టాప్‌లో వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, హెచ్డీఎంఐ, 3.5ఎంఎం ఆడియో జాక్, హెచ్డీ వెబ్‌కెమెరా వంటి అదనపు ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఇక వివోబుక్ ఎస్16 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.79,990 ఉండగా, క్రోమ్‌బుక్ సీఎక్స్ 15 ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.19,990 ధరకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అసుస్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.