సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 మ్యాక్స్ లాంఛ్ చేయనున్న యాపిల్
ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను సెప్టెంబర్ 7న యాపిల్ లాంఛ్ చేయనుంది. న్యూ మోడల్ భారీ డిస్ప్లే, బ్యాటరీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను సెప్టెంబర్ 7న యాపిల్ లాంఛ్ చేయనుంది. న్యూ మోడల్ భారీ డిస్ప్లే, బ్యాటరీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. అయితే గత ఏడాది చిప్‌సెట్‌నే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో వాడుతుండటం కొంత నిరాశకు గురిచేస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌లో ఫ్లాగ్షిప్ మోడల్స్ అన్నింటిలో ఉపయోగించిన ఏ15 బయోనిక్ చిప్సెట్ పవర్ఫుల్ పెర్ఫామెన్స్ కలిగిఉంది.
తక్కువ ధరలో భారీ స్క్రీన్, మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం అందించేలా ఎక్కువమంది కస్టమర్లను ఆకట్టుకునేలా ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ ముందుకు తెస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్ స్టాండర్డ్ ఐఫోన్ 14 వెర్షన్ కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 ధరలు రూ 10,000 అధికంగా ఉండనున్నాయి.
ఇక భారత్‌లో ఐఫోన్ 14 రూ 89,900కు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ 14 మ్యాక్స్ మోడల్ రూ 75,000 కంటే తక్కువకు లభించనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర, ఇతర వివరాలు సెప్టెంబర్ 7న అధికారికంగా వెల్లడవుతాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

