న్యూఢిల్లీ : ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌కు యాపిల్ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది మిని మోడల్ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని ప్రచారం సాగుతుండగా తాజాగా మరో అప్డేట్ ముందుకొచ్చింది. ఇక మ్యాక్స్ బదులు ఐఫోన్ 14 ప్లస్‌ను కస్టమర్ల ముందుకు యాపిల్ తీసుకురానుందని న్యూ రిపోర్ట్ వెల్లడించింది.
6.7 ఇంచ్ నాన్ ప్రొ మోడల్‌ను ఐఫోన్ 14 మ్యాక్స్ కాకుండా ఐఫోన్ 14 ప్లస్‌గా వ్యవహరిస్తారని 9టూ5 మ్యాక్ రిపోర్ట్ పేర్కొంది. ఐఫోన్ 6 ప్లస్ సక్సెస్‌తో ఐఫోన్ 14 ప్లస్‌కు మరింత పాపులారిటీ లభిస్తుందని ఈ పబ్లికేషన్ తెలిపింది. ఇక యాపిల్ వచ్చే వారం ఐఫోన్ 14, ఐఫోన్ 14ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లను లాంఛ్ చేయనుంది.
ఇక గతంలో యాపిల్ పలు ప్లస్ వేరియంట్లను తీసుకురాగా ఐదేండ్ల తర్వాత యాపిల్ మరో ప్లస్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్ ఐఫోన్ 14 ప్లస్‌గా కస్టమర్ల ముందుకు రానున్న క్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..ఐఫోన్ మోడల్ భారీ 6.7 ఇంచ్ డిస్ప్లే, ఏ16 బయోనిక్ చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరాలు, లార్జర్ బ్యాటరీ యూనిట్, ఐఓఎస్ 16 సపోర్ట్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.