న్యూయార్క్ : సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 (ఐఫోన్ 15) సిరీస్ లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు లేటెస్ట్ ఫోన్ ఉత్పత్తిలో యాపిల్ కోత విధించిందనే వార్తలు ఐఫోన్ కస్టమర్లను కలవరపెడుతున్నాయి. సరఫరా సమస్యలు ఎదురవుతున్నందన ఐఫోన్ 15ను కస్టమర్లకు చేరవేయడంలో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో తొలుత 8 కోట్ల ఐఫోన్ 15 యూనిట్స్‌ను డెలివరీ చేయాలని యాపిల్ భావించగా ఇప్పుడు ఆ యూనిట్ల సంఖ్యను 7.7 కోట్ల యూనిట్లకు పరిమితం చేశారని టెక్ విశ్లేషకులు జెఫ్ పు 9టూ5మ్యాక్‌కు తెలిపారు.
ఫోన్లలో కీలక పరికరమైన సోనీ కెమెరా సెన్సర్ల సరఫరాలో ఎదురువుతున్న ఇబ్బందుల కారణంగానే యాపిల్ ఈ సర్దుబాటు చేసిందని చెబుతున్నారు. ఇక ఐఫోన్ 15 వేరియంట్ పాత వెర్షన్‌తో పోలిస్తే ఇంచుమించు అదే ధరకు లభిస్తుందని లేకుంటే 50 డాలర్లు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
న్యూ ఫోన్లు లాంఛ్ చేసిన తర్వాత తన పాత వేరియంట్ల ధరలను తగ్గించే సంప్రదాయాన్ని యాపిల్ అనుసరిస్తే ఐఫోన్ 14 మోడల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్స్ 48 ఎంపీ రియర్ కెమెరాలతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది రెగ్యులర్ మోడల్స్‌లోనూ యాపిల్ డైనమిక్ ఐలండ్ ఫీచర్ రానుండగా, ఏ16 చిప్సెట్తో యాపిల్ లేటెస్ట్ ఐఫోన్లు మార్కెట్లో లాంఛ్ కానున్నాయి.
Read More :
Indore Firing : పెంపుడు కుక్కల గురించి గొడవ.. ఇద్దర్ని కాల్చి చంపిన ఓ వ్యక్తి.. వీడియో