న్యూఢిల్లీ : గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసిన అనంతరం మరో సేల్ ఈవెంట్‌తో అమెజాన్ కస్టమర్ల ముందుకొచ్చింది. న్యూ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ పేరుతో మరో సేల్‌ను షురూ చేసింది. ఈ సేల్ లైవ్‌లో ఉండగా అక్టోబర్ 28 వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్, షియోమి, శాంసంగ్, ఐక్యూఓఓ సహా పలు స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరలతో పాటు పలు డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.
అక్టోబర్ 28 వరకూ ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజర్లకు అక్టోబర్ 26 వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఐక్యూఓఓ జడ్6 5జీ, ఐక్యూఓఓ జడ్6 లైట్ 5జీ స్మార్ట్ఫోన్లు సేల్‌లో భాగంగా కేవలం రూ 14,999 రూ.13249కి అందుబాటులో ఉన్నాయి.
ఇందులో బ్యాంక్ ఆఫర్లు, క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్లు కలిసి ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2, 10ఆర్ వరుసగా రూ 23,499 రూ. 29499కి లభిస్తున్నాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో కస్టమర్లు రెడ్మి నోట్ 11టి 5జీని రూ 14,999కి సొంతం చేసుకోవచ్చు. రెడ్మి నోట్ 11 ప్రొ+ 5జీ రూ 18,499కి అందుబాటులో ఉండగా మరో బడ్జెట్ 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ రూ 12,999కి లభిస్తోంది. ఇక ఐఫోన్ 13పైనా అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.