Amazon Great Indian Festival Sale : అమెజాన్ సేల్ లో స్పెషల్ డీల్స్, ఆఫర్స్ ఇవే
అమెజాన్ సేల్ లో స్పెషల్ డీల్స్, ఆఫర్స్ ఇవే | అక్టోబర్ 2న, గాంధీ జయంతి రోజే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అయింది.
అక్టోబర్ 2న, గాంధీ జయంతి రోజే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అయింది. ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 3 నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సేల్.. నెల మొత్తం ఉండనుంది. అంటే.. వచ్చే నెల నవంబర్ 3 వరకు ఈ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో స్పెషల్ డీల్స్, ఆఫర్స్ ను అమెజాన్ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, లాప్ టాప్స్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇతర యాక్సెసరీస్ మీద అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు 10 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ముఖ్యంగా పలు స్మార్ట్ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. తాజాగా లాంచ్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ మీద 4000 రూపాయల డిస్కౌంట్ ను అందిస్తున్నారు. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.29,999 కాగా.. అమెజాన్ సేల్ లో రూ.25,999 కే లభిస్తోంది. దానితో పాటు కస్టమర్లు కూపన్ల ద్వారా వెయ్యి రూపాయల అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
అలాగే యాపిల్ ఫోన్ ఐఫోన్ 11 మీద కూడా అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. 64 జీబీ మోడల్ ఐఫోన్ 11ను రూ.38,999 కే అందిస్తున్నారు.
ఐక్యూ జెడ్ 3 5జీ ఫోన్ ను రూ.18,990 కే అందిస్తున్నారు. వీటితో పాటు ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, అమెజాన్ సొంత ప్రొడక్ట్స్, ఫైర్ టీవీ స్టిక్ 4కే, కిండిల్, స్మార్ట్ టీవీల మీద ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flipkart Big Billion Day Sale : రూ.38,999కే ఐఫోన్ 12 సిరీస్.. త్వరపడండి
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

