న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో జనరేటివ్ ఏఐ మోడల్స్‌లో ప్రస్తుతం చాట్‌జీపీటీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నలకు మానవ తరహాలో సమాధానాలు ఇచ్చే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌పై విస్తృత చర్చ జరుగుతోంది. తొలుత టెస్టింగ్ మోడల్‌గా చాట్‌జీపీటీ ప్రజలకు అందుబాటులో ఉండగా పలు న్యూ ఫీచర్లతో ఏఐ టూల్ ప్రీమియం వెర్షన్ సైతం యూజర్లకు అందుబాటులో ఉంది.
ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన చాట్‌జీపీటీకి ఆదరణ పెరగడంతో గూగుల్ తన సొంత ఏఐ చాట్‌బాట్ బార్డ్‌ను లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మాతృసంస్ధ ఓపెన్ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఈ రెండు కంపెనీలు కలిసి ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తాయి.
ఏఐ టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ తన బింగ్ న్యూ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇక ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీపై ఎప్పటినుంచో కసరత్తు సాగిస్తోంది. జనరేటివ్ ఏఐ, చాట్‌జీపీటీలపై అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ఇటీవల పలు వివరాలు వెల్లడించారు. చాట్‌జీపీటీ వంటి మోడల్స్‌పై తమ వంటి టెక్ కంపెనీలు భారీ, జనరేటివ్ ఏఐ మోడల్స్‌పై చాలా కాలంగా పనిచేస్తున్నాయని చెప్పారు.