Ai Plus Pulse And Nova 5G | ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అనే కంపెనీ భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశం చేసింది. అందులో భాగంగానే రెండు నూతన స్మార్ట్ ఫోన్లను అత్యంత చవక ధరకే రిలీజ్ చేసింది. ఒక ఫోన్ 4జి సేవలను అందిస్తుంది. మరో ఫోన్లో 5జి సేవలను పొందవచ్చు. అయితే ఈ రెండు ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండడంతోపాటు ధర కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఏఐ ప్లస్ కంపెనీ పల్స్, నోవా 5జి పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఐ పల్స్ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఏఐ ప్లస్ పల్స్ స్మార్ట్ ఫోన్లో యూనిసోక్ టి615 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 4జీబీ, 6జీబీ ర్యామ్ లభిస్తున్నాయి. 64జీబీ లేదా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను పొందవచ్చు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే సదుపాయం అందిస్తున్నారు. ఏఐ పల్స్ స్మార్ట్ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంగా ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను అందిస్తున్నారు. డ్యుయల్ 4జి, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం జాక్ వంటి సదుపాయాలను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఓఎస్‌ను ఇచ్చారు.
ఇక ఏఐ ప్లస్ నోవా 5జి స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఈ డిస్ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో యూనిసోక్ టి8200 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియెంట్లలో లాంచ్ అయింది. 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇతర ఫీచర్లు పల్స్ ఫోన్లో మాదిరిగానే ఉన్నాయి. ఈ రెండు ఫోన్లకు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. అయితే ఏఐ ప్లస్ పల్స్ స్మార్ట్ ఫోన్ కేవలం 4జి ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5జి కావాలంటే వినియోగదారులు ఏఐ ప్లస్‌కు చెందిన నోవా ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇక ఏఐ ప్లస్ పల్స్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.4,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,999గా ఉంది. ఏఐ ప్లస్ నోవా 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్లను జూలై 13వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ ద్వారా విక్రయించనున్నారు. యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్లపై రూ.500 డిస్కౌంట్‌ను ఇస్తారు. 3 నెలల వకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందించనున్నారు. ఎక్స్ఛేంజ్ బోనస్ సదుపాయం కూడా కల్పిస్తారు.