న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్ ప్రపంచంలో సమూల మార్పులకు కేంద్ర బిందువవుతోంది. మిడ్‌జర్నీ వంటి యాప్స్ ఉపయోగించి ఎన్నో క్రియేటివ్ ఇమేజ్‌లు సైతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ ఆర్టిస్ట్‌ల (AI pics ) ఊహా శక్తికీ రెక్కలు తొడుగుతోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత కుబేరులు పేదవారైతే ఎలా ఉంటారని ఊహిస్తూ ఓ వ్యక్తి వెల్లడించిన ఇమేజ్‌లు నెట్టింట వైరలవుతున్నాయి.
జెఫ్ బెజోస్ నుంచి ఎలన్ మస్క్ వరకూ పలువురు బిలియనీర్లు బికారులుగా పుడితే ఎలా ఉంటారనే ఊహకు ఈ చిత్రాలు ఊపిరిపోశాయి. ఆర్టిస్ట్ గోకుల్ పిళ్లై మిడ్‌జర్నీ యాప్‌తో ప్రపంచ కుబేరులను పేదలుగా ఆయా ఫోటోల్లో మార్చేశారు. ఈ చిత్రాల్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్, మస్క్ వంటి సంపన్నులు పేదలుగా కనిపించారు.
మురికివాడల్లో వీరంతా నిలుచుని, చిరిగిన బట్టల్లో కనిపిస్తారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 10,000 లైక్స్ లభించాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్స్..(ఈ లిస్ట్‌లో ఎవరినైనా చేర్చడం మర్చిపోయానా?) అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Read More