Samsung | చాట్‌జీపీటీ తరహా ఏఐ సర్వీస్ ప్రారంభించేందుకు శాంసంగ్ సన్నాహాలు
ఉద్యోగులకు కోడింగ్‌లో సాయపడటంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు శాంసంగ్ (Samsung )సొంతంగా చాట్‌జీపీటీ తరహా ఏఐ సర్వీస్‌ను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అంతర్గత వాడకం కోసమే న్యూ సర్వీస్‌ను నిర్మించేందుకు శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది.
న్యూఢిల్లీ : ఉద్యోగులకు కోడింగ్‌లో సాయపడటంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు శాంసంగ్ (Samsung )సొంతంగా చాట్‌జీపీటీ తరహా ఏఐ సర్వీస్‌ను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అంతర్గత వాడకం కోసమే న్యూ సర్వీస్‌ను నిర్మించేందుకు శాంసంగ్ కసరత్తు సాగిస్తోంది. కొరియాలోని శాంసంగ్‌కు చెందిన సెమీకండక్టర్ బిజినెస్‌లో పనిచేసే ఉద్యోగులు సున్నితమైన సమాచారాన్ని చాట్‌జీపీటీకి లీక్ చేయడం భద్రత దృష్ట్యా కలకలం రేపింది.
దీంతో తన సర్వర్ల నుంచి చాట్‌జీపీటీని తొలుత బ్యాన్ చేసిన శాంసంగ్ ఆపై ఉద్యోగుల్లో ఏఐ టూల్ పట్ల వ్యక్తమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఆపై పునరుద్ధరించింది. చాట్‌బాట్‌కు కీలక సమాచారాన్ని ఉద్యోగులు చేరవేస్తుండటంతో తిరిగి చాట్‌జీపీటీని బ్యాన్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీంతో సొంతంగా చాట్‌జీపీటీ తరహా ఏఐ సర్వీస్‌ను లాంఛ్ చేయాలని శాంసంగ్ కసరత్తు సాగిస్తోందని ఎకనమిస్ట్ కొరియా పేర్కొంది.
సెమికండక్టర్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరిచేలా జనరేటివ్ ఏఐ మార్పులు చేపడుతుందని శాంసంగ్ భావిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు గత నెలలో కంపెనీ ఉద్యోగులందరితో ఓ ఆన్లైన్ సెమినార్‌ను నిర్వహించింది. జనరేటివ్ ఏఐ సృష్టించిన భవిష్యత్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ హన్జోంగ్ హీ పేర్కొన్నారు.
జనరేటివ్ ఏఐని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. శాంసంగ్ ఇప్పటికే తమ స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌లో బిక్స్బీ ఏఐ సేవలను ఆఫర్ చేస్తోంది. ఇక కంపెనీలో అంతర్గత అవసరాల కోసం చాట్‌జీపీటీ తరహా ఏఐ చాట్‌బాట్ దిశగా శాంసంగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Read More
Sundar Pichai | గూగుల్ సెర్చింజన్‌కు చాట్‌జీపీటీ తరహా ఏఐ సపోర్ట్ : సుందర్ పిచాయ్
5G Smart Phones | రూ.15 వేల లోపు 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI service
- ChatGPT
- SAMSUNG
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

